Apple CFO: ఆపిల్ సీఎఫ్ఓగా భారత్ సంతతికి చెందిన కెవాన్ పరేఖ్
- ఐఫోన్ 16 లాంచ్ తేదీని ప్రకటించిన ఆపిల్
- కంపెనీ సీఎఫ్‌ఓ లూకా మేస్త్రి తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటన
- కొత్త సీఎఫ్ఓగా భారత సంతతికి చెందిన కేవన్ పరేఖ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపిల్ తన రాబోయే స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఐఫోన్ 16 లాంచ్ తేదీని ప్రకటించింది. దీనితో పాటు, తమ సీఎఫ్‌ఓ లూకా మేస్త్రి తన పదవికి రాజీనామా చేసినట్లు కూడా కంపెనీ తెలియజేసింది. లూకా స్థానంలో భారత సంతతికి చెందిన కేవన్ పరేఖ్ కొత్త సీఎఫ్ఓగా నియమితులయ్యారు. పరేఖ్ ఆపిల్‌తో 11 సంవత్సరాల పాటు అనుబంధం కలిగి ఉన్నారు. ప్రస్తుతం కంపెనీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయన జనవరి 1, 2025 నుంచి సీఎఫ్ఓ(చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్)గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఆపిల్ కంపెనీ సీఈవో టీమ్ కుక్ స్వయంగా ప్రకటించింది.
READ MORE: Andhra Pradesh: భర్తను హత్య చేసిన కేసులో భార్యతో సహా ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్ష..
Also Read
- Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
- IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
సీఎఫ్ఓగా నియమితులైన కేవన్ పరేఖ్ ప్రస్తుతం ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఎనాలసిస్ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా సేల్స్, రీటైల్, మార్కెటింగ్ వ్యవహారాలు పరీక్షిస్తున్నారు. కంపెనీ ఆర్థిక వాణిజ్య విభాగంలో కేవన్ పరేఖ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన సామర్థ్యం, ఫైనాన్షియల్ స్కిల్స్ గుర్తించిన ఆపిల్ కంపెనీ తదుపరి సీఎఫ్ఓగా ప్రకటించింది. కేవన్ పరేఖ్ మిచిగాన్ యూనివర్శిటీ నుంచి 1989-1993లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ అందుకున్నారు. ఆ తరువాత యూనివర్శిటీ ఆఫ్ చికాగో నుంచి ఎంబీఏ పట్టా పొందారు.
READ MORE:Cabinet Decisions: 12 కొత్త స్మార్ట్ సిటీలు,10 లక్షల మందికి ఉద్యోగాలు.. కేబినెట్ నిర్ణయం..
ఆపిల్ కంపెనీ కంటే ముందు కేవన్ పరేఖ్ థామ్సన్ రాయిటర్స్ , జనరల్ మోటార్స్ కంపెనీల్లో కీలకమైన పదవుల్లో పనిచేశారు. ఫైనాన్స్, కార్పొరేట్ ట్రెజరర్, డైరెక్టర్ ఆఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ రీజనల్ ట్రెజరర్ విభాగాల్లో వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వర్తించారు. 2013లో ఆపిల్ కంపెనీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఎనానలసిస్ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా చేరారు. ప్రస్తుతం ఆపిల్ కంపెనీ సీఎఫఓగా ఉన్న లూకా మేస్త్రి స్వయంగా తన తరువాత ఈ పదవికి కేవన్ పరేఖ్ సమర్ధుడని భావించి సిద్ధం చేశారు. సీఎఫ్ఓ నుంచి తప్పుకున్న తరువాత కూడా లూకా మేస్త్రి ఆపిల్ కంపెనీలో కొనసాగనున్నారు.
తాజావార్తలు
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!