Amazon: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అగ్రస్థానం దక్కించుకుంది. గతేడాది యాపిల్ తొలి స్థానంలో నిలవగా..ఈ ఏడాది అమెజాన్ తిరిగి తన స్థానాన్ని కైవసం చేసుకుంది. గతేడాదితో పోలిస్తే కంపెనీ విలువ 15 శాతం మేర తగ్గినప్పటికీ అమెజాన్ తొలి స్థానంలో నిలవడం గమనార్హం. ఈ మేరకు ‘గ్లోబల్ 500-2023’ పేరిట బ్రాండ్ ఫైనాన్స్ ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం 299.3 బిలియన్ డాలర్లతో అమెజాన్ నెంబర్ వన్‌గా నిలిచింది.
Read Also : Shubman Gill: స్టేడియంలో ‘సారా సారా’ స్లోగన్స్..గిల్ రియాక్షన్ ఇదిగో
కాగా, ఈ జాబితాలో యాపిల్ రెండో స్థానానికి పడిపోయింది. గతేడాది 355 బిలియన్ డాలర్లుగా ఉన్న దీని విలువ 16 శాతం క్షీణించి 297.5 బిలియన్ డాలర్లకు తగ్గింది. దీంతో అమెజాన్ తర్వాత రెండో అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. అలాగే గూగుల్ (281.4), మైక్రోసాఫ్ట్ (191.6), వాల్‌మార్ట్ (113.8), సామ్‌సంగ్ (99.7), ఐసీబీసీ (69.5), వెరిజోన్ (67.4), టెస్లా (66.2), టిక్ టాక్ (65.7) బిలియన్ డాలర్లతో వరుసగా టాప్-10లో చోటు దక్కించుకున్నాయి.కాగా, 2022లో టాప్-50లో నిలిచిన స్నాప్‌చాట్, ట్విట్టర్ ఈసారి టాప్-50లోనూ చోటు దక్కించుకోకపోవడం గమనార్హం. వీటితో పాటు శాంసంగ్, అలీబాబా, ఫేస్‌బుక్ వంటి అంతర్జాతీయ కంపెనీలు తమ వాల్యూను కోల్పోయాయి. ఇదే సమయంలో టెక్నాలజీ విభాగానికి చెందిన ఇన్‌స్టాగ్రామ్, లింక్‌డిన్ తమ బ్రాండ్ విలువను పెంచుకున్నాయి.
Read Also: Fenugreek Seeds : ఆగకుండా అయ్యే విరేచనాలను కట్ చేసే అద్భుతమైన చిట్కా