వైసీపీ ఎంపీ రఘురామరాజు కాలి గాయాలపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జీజీహెచ్ సూపరెండేంట్, జనరల్ మెడికల్ డిపార్ట్మెంట్ శాఖ HOD, గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరెండేంట్ సూచించిన గవర్నమెంట్ డాక్టర్.. ఈ ముగ్గురితో కూడిన మెడికల్ కమిటీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ వైద్య పరీక్షలను వీడియో రికార్డింగ్ చేయాలని… రికార్డు చేసిన వీడియోను పెన్ డ్రైవ్ లో సీల్డ్ కవర్లో హైకోర్టుకు వ్యాక్సినేషన్ ఆఫీసర్ M.నాగేశ్వరరావుకు…
ప్రధానమంత్రి మోడీకి సీఎం జగన్ లేఖ రాశారు. 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ కేటాయించాలని ఈ లేఖలో కోరారు సీఎం జగన్. అంతేకాదు ఏపీకి కేంద్రం చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో ఐసీయూ, ఆక్సిజన్ బెడ్ల సంఖ్య అదనంగా 30వేలకు పెంచనున్నామని.. దీని కోసం ప్రతి రోజు 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమని కోరారు. స్టోరేజ్ సదుపాయం లేకపోవడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి 100 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉపయోగించగలుగున్నామని..…
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది. అయితే ఈరోజు 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 89,535 శాంపిల్స్ పరీక్షించగా 22,517 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లోనే కోవిడ్తో 98 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో 18,739 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్…
నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి చెరుకువాడ రంగనాథ రాజు. రఘురామకృష్ణంరాజు 14 నెలలు నుండి ఢిల్లీలో కూర్చుని తనను గెలిపించిన ప్రజలను గాలికొదిలేశారని…కనీసం వారి బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదని నిప్పులు చెరిగారు. ఈ సమయంలో ఎంపీని అరెస్టు చేయడం సరికాదంటున్న ప్రతిపక్ష పార్టీలు తీరు సరికాదని…అసలు వారికి ఏంటి అతని మీద అంత ప్రత్యేక శ్రద్ధ అని చురకలు అంటించారు. పశ్చిమ గోదావరి జిల్లా అంటే ప్రశాంతంగా ఉన్న జిల్లా…
ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ నేపథ్యంలో ఏపీ సర్కార్ పై టిడిపి నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఏపీలో నియంత పాలన సాగుతోందని మండిపడ్డారు. దేశంలో ఏకైక మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్ అంటూ లోకేష్ పేర్కొన్నారు. ” నియంత కంటే ఘోరంగా ప్రజల ప్రాణాల రక్షణ పట్టించుకోకుండా, తన కక్ష తీర్చుకోవడానికే ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుతున్న దేశంలో ఏకైక మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్. ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కోల్పోయేలా వ్యాఖ్యలు చేశారని..వై కేటగిరి భద్రతలో వుంటూ ఇటీవలే…
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట ఉండూరు బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు హైవే పెట్రోలింగ్ పోలీసులపైకి దూసుకెళ్లింది లారీ. ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మెండి సత్యనారాయణ, హోమ్ గార్డు ఎన్. ఎస్. రెడ్డి అక్కడిక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడ నుండి వస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ వెహికిల్ కు ఎస్కార్ట్ గా వెళ్లేందుకు బ్రిడ్జి వద్ద ఇద్దరు హైవే పెట్రోలింగ్ పోలీసులు వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి రెండు…
ప్రభుత్వ వైఫల్యం వల్లే తిరుపతి ఆస్పత్రిలో మరణాలు సంభవిస్తున్నాయి. సిటింగ్ జడ్జి చేత విచారణ చేసి, వాస్తవాలను ప్రజల ముందుంచాలి అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. పచ్చి అబద్ధాలు చెబుతున్న ముఖ్యమంత్రి… 30 మంది చనిపోతే 11 మంది అని చెప్పడం దారుణం. వాస్తవాలు చెప్పేవారిని బెదిరించి, అసత్యాలకు పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి పిచ్చి చేష్టలు మానాలి.. వాస్తవాలు ఒప్పుకోండి. కళ్లు తెరిచి ప్రజలను కాపాడటానికి ప్రయత్నించండి. కరోనా వల్ల చనిపోయిన 9వేల మందివి ప్రభుత్వ హత్యలే.…
నెల్లూరులో కలెక్టర్ భవనంలో మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన నీటిపారుదల శేఖ మంత్రి అనీల్ మరియు జిల్లా కలెక్టర్ ,జిల్లా SP సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆక్సిజన్ కొరత సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ… నేను, మేకపాటి ఈ మధ్య కరోనా నుండి కొలుకున్నాం. జిల్లలో ప్రతిపక్షం ఇంట్లో కూర్చొని కరోనా పై మాట్లాడటం విడ్డురంగా ఉంది. జిల్లాలో ఆక్సిజన్ , బెడ్లు కొరతలేవు. ప్రతిపక్షాలు ప్రభుత్వం…
ప్రధాని మోడీకి ఏపీ సిఎం జగన్ మరో లేఖ రాశారు. ఆక్సిజన్ కేటాయింపులు, సరఫరాపై ప్రధానికి సిఎం జగన్ లేఖ రాశారు. కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలని సిఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. 20 ఆక్సిజన్ ట్యాంకర్లను ఏపీకి మంజూరు చేయాలని సిఎం జగన్ లేఖలో కోరారు. కోవాగ్జిన్ తయారీ దేశీయ అవసరాలను పూర్తిగా తీర్చలేకపోయిందని, ఈ వ్యాక్సిన్ ను భారీగా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడిందని సిఎం జగన్ తెలిపారు.…
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ… సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ వేసింది. చంద్రబాబు, ఆయన అనుచరగణం.. రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ను అదనంగా కొనుగోలు చేయటం లేదని ఆరోపిస్తున్నారు. దీని వల్ల ప్రజలు ఆందోళనతో వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర పెద్ద ఎత్తున పోగయి వైరస్ వ్యాపించటానికి కారణం అవుతున్నారు. మేము కంపెనీలకు వ్యాక్సిన్ కోసం లేఖలు రాశాం… కేటాయింపులు పూర్తిగా కేంద్రం చేతిలోనే ఉందని చెబుతున్నా…తిరిగి అవే ఆరోపణలు చేస్తున్నారు.…