ప్రభుత్వాన్నీ అస్థిరపరచడం,బురద జల్లడమే చంద్రబాబు లక్ష్యం అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో లోకేష్ పర్యటనలో కరోనాతో మరణించిన పార్టీ నాయకులు కుటుంబాల పరామర్శ కోసం అని భావించాం. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి పరామర్శ పేరుతో వచ్చిన లోకేష్… రాజకీయం మాట్లాడి వెళ్లారు. లోకేష్ కు చరిత్ర తెలియదు… టీడీపీ హయాంలోనే కారంచేడులో దళితుల్ని ఊచకోత కోశారు. దళితుల గురించి మాట్లాడే హక్కు లోకేష్, చంద్రబాబుకి లేదు. టీడీపీ అన్ని వర్గాలను దూరం చేసుకున్నందుకే జగన్మోహన్ రెడ్డికి ఏక పక్ష విజయాన్ని ప్రజలు కట్టబెట్టారు అని తెలిపారు.
ఐదు కోట్ల మంది ఎన్నుకొన్న ముఖ్యమంత్రి ని లోకేష్ శాడిస్ట్ అనడమేనా సంస్కారం. లోకేష్ భాష, నోరు అదుపులో పెట్టుకోవాలి అని సూచించారు. ప్రతిపక్షం చేసే విమర్శలు అర్థవంతంగా ఉండాలి తప్ప దూషణలు చేస్తే సహించేది లేదు. నరేంద్ర మోడీ పేరు చెబితే చంద్రబాబు గజగజ వణుకుతాడు…అందుకే వ్యాక్సినేషన్, ఇతర అవసరాల కోసం కేంద్రానికి ఒక లేఖ కూడా రాయలేదు. పార్టీ నాయకులు ఆసుపత్రులను తనిఖీ చేయాలని పిలునివ్వడం ఏంటి… తనిఖీ చేయడానికి వాళ్లేమైన డాక్టర్లా అని అన్నారు మంత్రి అవంతి.