తిరుమల టీటీడీలో మరో వివాదం చోటు చేసుకుంది. తనకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించారు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలదీక్షితులు. గొల్లపల్లి వంశం నుంచి తాను ప్రధాన అర్చకుడిగా కొనసాగుతుండగా తమ కుటుంబం నుంచే రమణదీక్షితులను ప్రధాన అర్చకుడిగా నియమించడాన్ని హైకోర్టులో సవాలు చేశారు వేణుగోపాలదీక్షితులు. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ, రమణదీక్షితులను పేర్కొన్నారు వేణుగోపాలదీక్షితులు. అయితే ఈ ఫిల్ ను స్వీకరించి ప్రభుత్వం, టీటీడీ, రమణదీక్షితులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. శ్రీవారి ఆలయ…
ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అయితే ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరుగనుంది. ముఖ్యంగా వైఎస్సార్ రైతు భరోసా పథకానికి ఆమోదం తెలుపనున్న కేబినెట్..రైతు భరోసా కోసం 3 వేల 30 కోట్లకు ఆమోదం తెలుపనుంది. అలాగే వైఎస్సార్ ఉచిత భీమా పథకానికి ఆమోదం తెలుపనున్న కేబినెట్.. 2,589 కోట్లతో వైఎస్సార్ ఉచిత భీమా పథకం అమలు చేయనుంది. వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకానికి ఆమోదం తెలపనున్న కేబినెట్.. మత్స్యకారులకు 10…
తిరుపతిలో అమరరాజ బ్యాటరీ కంపెనీకి షాక్ ఇచ్చింది ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. పొల్యూషన్ నిబంధనలు పాటించని కారణంగా అమరాజ బ్యాటరీ కంపెనీలు మూసేయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. ఏమరాన్ పేరుతో బ్యాటరీలు ఉత్పత్తి చేస్తున్న అమరరాజ కంపెనీ నుంచి వచ్చే లెడ్ వల్ల తీవ్రమైన జల కాలుష్యం జరుగుతొందని నోటీసులో పేర్కొంది పీసీబీ. చిత్తూరు, తిరుపతి కరకంబాడీ రెండు యూనిట్లు మూసేయ్యాలని ఆదేశించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్… ఈ రెండు ప్లాంట్లలో వచ్చే లెడ్ వల్ల…
శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ఆస్పత్రి కారణంగా ఓ కరోనా రోగి మరణించింది. అసలు వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాలోని పెంట ఆగ్రహారం గ్రామానికి చెందిన కరోనాతో బాధపడుతోంది. వైద్యం కోసం ఆమెను కుటుంబ సభ్యులు బుధవారం రాజాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకోచ్చారు. రోగికి ఆరోగ్య శ్రీ వర్తించకపోవడంతో ముందుగా డబ్బు చెల్లించాలని ఆస్పత్రి యాజమాన్యం చెప్పింది. అయితే డబ్బు రూపంలో మాత్రమే ఫీజు చెల్లించాలని, ఆన్లైన్ పేమెంట్స్ అంగీకరించబోమని ఆస్పత్రి…
టిడిపి అధినేత చంద్రబాబుపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో చంద్రబాబుకు చిప్పకూడు ఖాయమని..చంద్రబాబుకు ముని శాపం ఉంది నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో నాయకులు అందరూ దొంగలే అయినా దొరలాగా తిరిగారని..చంద్రబాబు నాయుడి, అచ్చెం నాయుడు, దేవినేని ఉమకు త్వరలో జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. హెరిటేజ్ కోసం చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న పాలడెయిరీలు అన్నిటిని నిర్వీర్యం చేసాడని… సంగం డైరీ ఎవడబ్బ సొత్తు…
ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారాయి. పరీక్షలను వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే.. ఎలాగైనా నిర్వహిస్తామని ఏపీ సర్కార్ అంటోంది. ఈ నేపథ్యంలో ఏపీ పది, ఇంటర్ పరీక్షలపై హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని, ఇది లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన అంశామని హై కోర్టు పేర్కొంది. కరోనా నేపథ్యంలో ఏపీ సర్కార్ పునరాలోచించాలని తెలిపింది. పక్క రాష్ట్రాలలో పరీక్షలు వాయిదా వేస్తే..…
కోవిడ్ చికిత్స రేట్లు పెంచింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్… కోవిడ్ చికిత్సకు ఇప్పుడు ఇస్తున్న రేట్లు పెంచండి అని తెలిపారు. ప్రభుత్వ జాబితా (ఎంప్యానెల్)లో ఉన్న ప్రైవేటు ఆస్పత్రులలో కోవిడ్ చికిత్సకు వెంటనే రేట్లు పెంచండి. అవే రేట్లను కోవిడ్ చికిత్స చేస్తున్న ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల (ఎంప్యానెల్)కు కూడా వర్తింప చేయండి. ఏ ఆస్పత్రి (ప్రభుత్వ ఎంప్యానెల్)లో కూడా కోవిడ్ చికిత్సకు నిరాకరించకుండా చూడండి.కోవిడ్ ఆస్పత్రులలో పని…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజుకు వెయ్యికి పైగా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 14,792 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,84,336 కు చేరింది. ఇందులో 9,62,250 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,14,158 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో…
కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్ పై సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ… దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారు 26 కోట్లు ఉన్నారు. వారికి నాలుగు వారాల వ్యవధిలో రెండో రెండో డోస్ ఇవ్వాలి. ఆ మేరకు మొత్తం 52 కోట్ల వాక్సిన్లు కావాలి. తొలి డోస్ ఇప్పటి వరకు కేవలం 12 కోట్ల మందికి మాత్రమే వేశారు. 2.60 కోట్ల మందికి ఇప్పటి వరకు రెండో డోస్ మాత్రమే వేశారు. మొత్తం కలిపి చూసినా ఇప్పటి వరకు…
ఏపీలో 10 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 11,434 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,54,875 కు చేరింది. ఇందులో 9,47,629 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 99,446 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా…