ఏపీకి వచ్చే వారికి అలర్ట్ : ఈ రూల్స్ పాటించాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పొరుగు రాష్ట్రాలలో ఈ పాస్ నిబంధనలను ఆకళింపు చేసుకొని ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలు విధించిన నిబంధనలను ప్రజలు అర్థం చేసుకొని ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలన్నారు. ఈ-పాస్ లేకుండా ప్రయాణించడం ద్వారా రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ల వద్ద అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ఇప్పటికే తమ దృష్టికి వచ్చిందని డీజీపీ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం పొరుగు రాష్ట్రాలలో అమలవుతున్న ఈపాస్ నిబంధనలను పరిశీలించిందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.
A) ఇతర రాష్ట్రాల నుండి ఏపీ కి రావాలనుకొంటే:
ఆంద్రప్రదేశ్ లో ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంది. కాబట్టి ఇతర రాష్ట్రాల నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రావాలనుకొనే వారు, ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉదయం 6 గంటల నుండి 12:00 గంటల మధ్యనే ప్రయాణించేలా, ఆ లోపే తమ గమ్యానికి చేరుకునేలా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోగలిగితే అట్టి వారికి ఎలాంటి పాస్ లు అవసరం లేదు. ఆ సమయం కాకుండా మిగతా సమయంలో ప్రయాణించదలిస్తే ఈపాస్ కచ్చితంగా అవసరం ఉంటుంది. అంటే ఉదయం పన్నెండు తర్వాత బోర్డర్ దాటి ఏపీ భూభాగం లోకి ప్రవేశించాలనుకునే వారు లేదా ఆంద్రప్రదేశ్ భూభాగం లో 12 గంటల తర్వాత ప్రయాణించాలనుకొనే వారికి ఈపాస్ అవసరం. ప్రభుత్వం G.Oలో పేర్కొన్న మినహాయింపు సేవలు అనగా అత్యవసర సేవలు, అంబులెన్స్ తదితర సేవలు మరియు సంబంధిత సిబ్బందికి ఎలాంటి ఈ-పాస్ అవసరం లేదు.
Also Read
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
B)రాష్ట్రంలో ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణించాలంటే:
ఏపీలో ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి ఉదయం 6 గంటల నుండి 12:00 గంటల మధ్యనే ప్రయాణించేలా, ఆ లోపే తమ గమ్యాన్ని చేరుకునేలా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోగలిగితే అట్టి వారికి కూడా ఎలాంటి ఈపాస్ లు అవసరం లేదు. ఆ సమయం కాకుండా మిగతా సమయంలో ప్రయాణించదలిస్తే మాత్రం ఈపాస్ కచ్చితంగా అవసరం ఉంటుంది.అట్టి వారు తప్పనిసరిగా పూర్తి దృవ పత్రాలతో ఈ-పాస్ కు అప్లై చేసి ఈపాస్ పొందగలరు. ప్రభుత్వం G.O లో పేర్కొన్న మినహాయింపు సేవలు మరియు సంబంధిత సిబ్బందికి ఎలాంటి ఈ-పాస్ అవసరం లేదు.
C) ఈ పాస్ లింక్ పొందడం ఎలా?:
ఆంధ్ర ప్రదేశ్ లో కర్ఫ్యూ సమయంలో ప్రయాణానికి తప్పనిసరిగా సిటిజన్ సర్వీస్ పోర్టల్(http://appolice.gov.in), ట్విట్టర్ (@APPOLICE100,ఫేస్ బుక్ (@ANDHRAPRADESHSTATEPOLICE) ద్వారా ఈపాస్ పొందవచ్చు.
D) తెలంగాణాలోకి ప్రవేశించాలంటే ఈపాస్ తప్పనిసరి:
తెలంగాణాలో ఉదయం 6 నుండి 10 వరకు కర్ఫ్యూ ఉండదు. మిగతా సమయాల్లో కర్ఫ్యూ ఉంటుంది. కానీ తెలంగాణా భూభాగంలోకి ప్రవేశించాలంటే, కర్ఫ్యూ ఉన్నా లేక పోయినా పాస్ తప్పని సరి. అట్టివారు https://policeportal.tspolice.gov.in/ ద్వారా తెలంగాణ ఈ-పాస్ పొందిన తర్వాతే ప్రయాణించాల్సి ఉంటుంది.
E) తమిళనాడు లోకి ప్రవేశించాలంటే ఈపాస్ తప్పనిసరి:
తమిళనాడు లో పూర్తి స్థాయి లో కర్ఫ్యూ అమలో ఉంది. తమిళనాడు భూభాగంలోకి ప్రవేశించాలంటే, కర్ఫ్యూ ఉన్నా లేక పోయినా పాస్ తప్పని సరి. అట్టివారు (https://eregister.tnega.org/)
ద్వారా తమిళనాడు ఈ-పాస్ పొందవచ్చు.
F) ఒరిస్సా రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే ఈపాస్ తప్పనిసరి:
ఒరిస్సా లో పూర్తి స్థాయి లో కర్ఫ్యూ అమలో ఉంది. ఒరిస్సా భూభాగంలోకి ప్రవేశించాలంటే, కర్ఫ్యూ ఉన్నా లేక పోయినా పాస్ తప్పని సరి. అట్టివారు (https://covid19regd.odisha.gov.in/) అనే లింక్ ద్వారా ఈ-పాస్ పొందవచ్చు.
G) కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే:
కర్ణాటక లో పూర్తి స్థాయి లో కర్ఫ్యూ అమలో ఉంది. కర్ణాటక భూభాగంలోకి ప్రవేశించాలంటే ఆ రాష్ట్రంలో ఈపాస్ వ్యవస్థ ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన లింక్ ద్వారా కర్నాటక లోకి కూడా పాస్ ఇవ్వబడును. కానీ కర్ణాటక ప్రభుత్వం అవసరాన్ని బట్టే వారి భూభాగం లోకి ప్రవేశానికి అనుమతి ఇస్తుందన్న విషయాన్ని గమనించగలరు.
H) శుభకార్యాలు, అంతక్రియలకు సంబంధించి ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి సంబంధిత స్థానిక అధికారుల వద్ద సరైన గుర్తింపు పత్రాలతో అనుమతి పొందాలి.
- Tags
- ap
- Covid19
- dgp savang
- strict rules
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..