రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని..ఎదిగే కొద్ది ఒదగాలి అనేది తన విధానం.. మనమంతా ప్రజలకు సేవకులమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రైతుకు విత్తనం నుంచి పంట అమ్మేవరకు తోడుగా నిలబడుతున్నామని.. ఆర్బీకేల ద్వారా కల్తీ లేని విత్తనాలు, మందులు, ఇన్ పుట్ అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆర్బీకేల ద్వారా రైతులకు గిట్టుబాటు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని..కుట్రలు చేసి పంచాయతీలపై ఆకుపచ్చ, నీలం రంగులను తుడిచివేయించగలిగారని టిడిపి కి చురకలు అంటించారు. జనం గుండెల్లో ఉన్న…
ఇవాళ ఏపీ బడ్జెట్ సమావేశాలను జగన్ సర్కార్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా అసెంబ్లీలో..సిఎం జగన్ మాస్కు లేకుండా దర్శనం ఇచ్చారు. ఈ నేపథ్యంలో సిఎం జగన్ పై టిడిపి నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఏపీలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయని.. ఇలాంటి సమయంలో సిఎం జగన్ మాస్క్ పెట్టుకోకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రే మూర్ఖంగా మాస్క్ పెట్టుకోకపోతే, ఇక మంత్రులూ, ఎమ్మెల్యేలూ మాస్కులెందుకు ధరిస్తారు? అంటూ సిఎం జగన్ కు చురకలు అంటించారు…
టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్ వేశారు. చంద్రబాబు బతుకు అంతా.. అన్నీ దొంగ మాటలు, డొల్లతనమేనని పేర్కొన్నారు. ఈ జీవి జీవితమే అంత అని… వినేవాడుంటే- చార్మినార్ కూడా నేనే కట్టా అని చద్రబాబు అంటాడని ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. “ఇదీ హైదరాబాద్ లో జెనోమ్ వ్యాలీ తానే పెట్టాను అంటూ పదే పదే డబ్బా కొట్టే ఫేక్ విజనరీ, మీడియా మేడ్ మాన్ చంద్రబాబు బతుకు – అన్నీ దొంగ…
నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం 9 గంటలకు ఈ సమావేశం ప్రారంభం అవుతుంది. అసెంబ్లీ, మండలి సమావేశాలు ఈరోజు జరగబోతున్నాయి. ఒక్కరోజు మాత్రమే ఈ సమావేశం ఉంటుంది. అయితే.. రూ. 2.25 -రూ. 2.30 లక్షల కోట్ల మధ్యలో 2021-22 వార్షిక బడ్జెట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్ లో సంక్షేమ పథకాల అమలుకు పెద్ద పీట వేయనుంది ఏపీ సర్కార్. సామాజిక పెన్షన్ను రూ. 2500కు పెంచనున్న ప్రభుత్వం……
నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం మరియు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతములోనికి ప్రవేశించే అవకాశం ఉంది. సుమారుగా 22.05.2021వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రం మరియు దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం…
కరోనా విషయంలో ముఖ్యమంత్రికి ఎన్ని లేఖలు రాసిన స్పందన లేదు.. అధికారులు ఫోన్ కూడా ఎత్తరు. ముఖ్యమంత్రి లేఖలకు ప్రధానమంత్రి స్పందన కూడా ఇలాగే ఉంటుంది అని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. కరోనా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ విఫలమయ్యాయి. ముఖ్యమంత్రి కరోనా తో ప్రజలు సహజీవనం చేయాలంటారు ఆయన మాత్రం ఇంట్లో ఉంటారు. కరోనా లేనప్పుడు కూడా అతి ఎక్కువ కాలం హోమ్ క్వారంటైన్ ఉన్న ముఖ్యమంత్రి జగన్ అని తెలిపారు.…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరికొన్ని కరోనా టీకా డోసులు చేరుకున్నాయి. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో 50 వేల కొవాగ్జిన్ టీకా డోసులు చేరాయి. అయితే రాష్ట్రానికి కొత్తగా చేరిన 76 వేల కొవిషీల్డ్, 50 వేల కొవాగ్జిన్ టీకాలతో వ్యాక్సిన్ కొరతకు కొంత ఉపశమనం లభించింది. ఈ టీకాలను వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో ఆయా జిల్లాలకు తరలించనునారు అధికారులు. మరికొన్ని టీకా డోసులు రాష్ట్రానికి చేరుకొనే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనా వేస్తున్నారు. అయితే ఏపీలో కరోనా…
టిడిపికి సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. టిడిపికి మాట్లాడటానికి, చెప్పుకోవడానికి ఏమి లేదని.. అందుకే సభకు రామంటున్నారని సజ్జల పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేస్తే టిడిపి గగ్గోలు పెడుతోందని.. రఘురామకృష్ణరాజు ఏడాది నుంచి ప్రభుత్వంపై విద్వేషం ప్రదర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. సిఎం జగన్ కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని.. రఘురామకృష్ణరాజు అరెస్ట్ రాత్రికి రాత్రే జరిగింది కాదన్నారు. రఘురామకృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశామన్నారు. టిడిపి అడ్డదారుల్లో వైసీపీ సర్కార్…
మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి పాలసీ 2021-22ను ప్రారంభించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ప్రస్తుతం ఉన్న 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 700 మెట్రిక్ టన్నులకు పెంచటమే ఉద్దేశ్యంగా ఈ పాలసీని ప్రారంభించారు. రాష్ట్రంలో 50 పీఎస్ఏ ప్లాంట్లు ఏర్పాటు చేయడం లక్ష్యంగా పాలసీ రూపుదిద్దుకుంటోంది. ముందుకు వచ్చే ఆక్సిజన్ ఉత్పత్తిదారులకు పలు ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. పెట్టుబడిలో 30 శాతం వరకు సబ్సిడీ కూడా ఇవ్వనుంది. అలాగే విద్యుత్ యూనిట్ కు…
నరసాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఆయన అరెస్ట్ ను వైసీపీ సమర్థిస్తుంటే.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. ఈ తరుణంలో టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కస్టడీలో ఉన్నఎంపీని కొట్టి హింసించారని చంద్రబాబు పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని..ఈ విషయంలో వారికి ఫస్ట్ ప్రైజు ఇవ్వవచ్చని ఎద్దేవా చేశారు. “కస్టడీలో ఉన్నఎంపీని కొట్టి హింసించారని చంద్రబాబు, ఆయన పచ్చ మీడియా హోరెత్తించిన అసత్యపు…