రఘురామకృష్ణరాజు విడుదలపై పెద్ద వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గుంటూరు అర్బన్ ఎస్పీకి కోర్టు ధిక్కార నోటీసులు పంపారు రఘురామకృష్ణరాజు న్యాయవాది దుర్గాప్రసాద్. రఘురామ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే తీసుకురావాలని ఎస్కార్ట్‌ను ఆదేశించినట్లు సమాచారం అందుతోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రఘురామ బెయిల్ పై విడుదలైనట్లేనని..విడుదలైన 10 రోజులకు బాండ్లను కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని న్యాయవాది దుర్గాప్రసాద్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రఘురామను తీసుకురావాలని ఎస్కార్ట్ ను పంపడం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లేనని..అందుకే నోటీసులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు రఘురామ న్యాయవాది దుర్గాప్రసాద్. హైదరాబాద్ నుంచి గుంటూరు అర్బన్ ఎస్పీకి వాట్సప్ లో నోటీసులు పంపారు దుర్గాప్రసాద్. అటు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతికి హైకోర్టు నోటీసు పంపింది. ఎంపీ రఘురామకృష్ణరాజు వైద్యపరీక్షల నివేదిక ఆలస్యంపై వివరణ కోరింది కోర్టు.