ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది. అయితే ఈరోజు కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 58,835 శాంపిల్స్ పరీక్షించగా 12,994 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లోనే కోవిడ్తో 96 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో 18,373 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య…
కరోనా తగ్గుతున్న వేళ చంద్రబాబు నాయుడు, లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నారు అని ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ అన్నారు. ఎప్పుడు ఎవరు చనిపోతారా ఆ విషయాన్ని రాజకీయం చేయాలా అని తండ్రి కొడుకులు ఆలోచిస్తారు. చంద్రబాబు రాబందులా… చనిపోయిన వారికి పెట్టే పిండం తినడానికి వచ్చే కాకిలా లోకేష్ తయారయ్యారు అని తెలిపారు. డాక్టర్ సుధాకర్ విషయంలో చంద్రబాబు అతని తనయుడు రాజకీయ కుట్రలు చేశారని అందరికీ తెలుసు. కుట్రలో చిక్కుకున్నానని డాక్టర్ సుధాకర్ అప్పుడే…
ఆనందయ్య కి భద్రత పై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని సమీక్ష నిర్వహించారు. కృషపట్నం పోర్టులో అడిషనల్ ఎస్పీ వెంకటరత్నం తో పాటు పలువురు పోలీసులు తో సమావేశమయ్యారు ఎమ్మెల్యే కాకాని. ఆనందయ్య కి గట్టి భద్రత ఇవ్వాల్సిందిగా అడిషనల్ ఎస్పీ ని కోరిన ఎమ్మెల్యే కాకాని అనంతరం ఎన్టీవీ తో మాట్లాడుతూ… ఐసిఎంఆర్ వచ్చే అవసరం లేదు. ఆయుష్ నివేదిక నే ప్రభుత్వం ఫైనల్ గా తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి సానుకూలంగా వున్నారు కాబట్టి …ప్రభుత్వం…
అత్యవసర పరిస్థితుల్లో అల్లోపతి వైద్యం తప్పదు అని మంత్రి బుగ్గన అన్నారు. ఆయుర్వేదిక్, హోమియోపతి వేల సంవత్సరాల నుంచి వున్నా అత్యవసరంలో అల్లోపతి బెటర్ అని తెలిపారు. కోవిడ్ విషయంలో ప్రపంచం అనుసరిస్తున్న ప్రోటోకాల్ ఫాలో కావాల్సి వస్తుంది. కరోనాను ఏపీ ప్రభుత్వం అద్భుతంగా హాండిల్ చేస్తుంది. ప్రభుత్వం, అధికారులు కరోనాకట్టడికి నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రతిరోజు ప్రభుత్వం కరోనా పై సమీక్ష చేస్తుంది. కోవిడ్ నివారణకు ప్రజల సహకారం ముఖ్యం అని తెలిపిన మంత్రి బుగ్గన లక్షణాలు…
ఈరోజు క్యాంపు కార్యాలయంలో కోవిడ్ నియంత్రణ, తాజా పరిస్థితి, వ్యాక్సినేషన్ పై సమీక్ష చేపట్టనున్నారు సీఎం జగన్. ఇందులో ఆనందయ్య మందు పై జరుగుతున్న క్షేత్ర స్థాయి పరిశీలన అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మూడు, నాలుగు రోజుల్లో నివేదిక వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశించారు సీఎం. ఇక ఈ సమీక్షకు వైద్య, ఆరోగ్య శాఖ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళనాని, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింఘాల్, ఇతర…
యాస్ తుఫానుపై హోమ్ మంత్రి అమిత్ షాతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. తుపాను వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు సీఎం జగన్. ఈ సందర్బంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అధికారులను అప్రమత్తం చేశామని సీఎంకు వివరించారు అధికారులు. తుఫాను వల్ల కోవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని..ముందు జాగ్రత్తగా వారిని తరలించాల్సిన పరిస్థితులు ఉంటే వెంటనే ఆ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం…
మాజీ ఎమ్మెల్యేలు కూనరవికుమార్, బిసి జనార్దన్ రెడ్డి ఇవాళ అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ పై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ప్రజల్ని కరోనాకు బలిస్తూ ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు పనిలో బిజీగా ఉన్నారని సిఎం జగన్ కు చురకలు అంటించారు. “సహజీవనం చేసుకోండి అంటూ ప్రజల్ని కరోనాకి బలిస్తూ ప్రతిపక్ష నేతల పై కక్షసాధింపు పనిలో బిజీగా ఉన్నారు సిఎం జగన్. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత,బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్…
దూళిపాళ్ల నరేంద్రకు బెయిల్ మంజూరు అయింది. నెల రోజుల క్రితం సంగం డైరీ కేసులో నరేంద్రను అరెస్ట్ చేసిన ఏసీబీ… ప్రస్తుతం రాజమండ్రిలో రిమాండ్ ఖైదీగా ఉండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దూళిపాళ్ల. అయితే ఇవాళ.. సంగం డెయిరీలో అవకతవకలు కేసులో A1 ముద్దాయి ధూళిపాళ్ళ నరేంద్రకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. నాలుగు వారాల పాటు ధూళిపాళ్ళ నరేంద్ర విజయవాడలోనే ఉండాలని..విజయవాడలో ఎక్కడ ఉంటున్నారో ఇంటి అడ్రస్ కోర్టుకు తెలుపాలని హై…
టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. శవాలపై పేలాలు ఏరుకునేవాడిలా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. “శవాలపై పేలాలు ఏరుకునేవాడిలా నీ శవ రాజకీయాలేంటి చంద్రబాబూ? శవం దొరికితే చాలు రాబందులా వాలి రాజకీయం చేస్తున్నావు. ఇంత దరిద్రపు ప్రతిపక్షం ఎక్కడా లేదు. డాక్టర్ సుధాకర్ మృతితో ఆ కుటుంబం విషాదంలో ఉంటే నీ పాలిట్రిక్స్ ఏంటి? అంత ప్రేమున్నోడివి ఆయన ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఎందుకివ్వలేదు? ” అంటూ విజయసాయిరెడ్డి…
కర్నూలు జిల్లా.. బనగానపల్లె టిడిపి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరులపై దాడి చేసిన ఘటనలో జనార్దన్ రెడ్డితో పాటు మరో 9 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో జనార్దన్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు భారీ ఎత్తున మోహరించారు పోలీసులు. దీంతో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. టిడిపి కార్యకర్తల్లో భయాందోళనలు, సృష్టించేందుకే పోలీసుల…