టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 14 ఏళ్లు సిఎంగా ఉండి చంద్రబాబు పొడిచింది ఏముంది? అని మండిపడ్డారు. “ఈ ‘వారం రోజుల సిఎం కుర్చీ’ పగటి కల ఏంటి చంద్రబాబు? జనం నవ్వుకుంటారన్న ఇంగితం కూడా లేదు. 14 ఏళ్లు సిఎంగా ఉండి పొడిచింది ఏముంది? ఏ స్కీమ్ వల్లనైనా ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని గుండె మీద చేయి వేసుకొని చెప్పగలవా? ప్రజలను దోచుకున్నందుకేగా నీకు సున్నం…
ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని చుండూరు ఎస్సై శ్రావణి, కానిస్టేబుల్ రవీంద్ర ఆత్మహత్యాయత్నం చేశారు. గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నం చేశారు. సకాలంలో వారిని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. అసత్య ప్రచారాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ ఘటనపై చుండూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సై శ్రావణి…
కడప జిల్లాలో ఘోర పేలుడు సంభవించింది. ముగ్గురాయి క్రషర్ వద్ద పేలుడు పదార్థాలు పేలి సుమారు 10 మంది క్వారీ కూలీలు మృతి చెందారు. ఆ జిల్లాలోని పొరుమామిళ్ల మండలం మామిల్లపల్లె వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. క్వారీలో ముగ్గురాయి వెలికితీత పనులకు వెళ్లిన కూలీలు…వెలికితీత సమయంలో ఒక్కసారిగా పేలుడు పదార్థాలు పేలాయి. దీంతో అక్కడికక్కడే 10 10 మంది క్వారీ కూలీలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం…
టిడిపి అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు దిమ్మతిరిగే షాక్ తగిలింది.అసైన్డ్ భూముల జీవో కేసులో చంద్రబాబుపై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలంది సీఐడీ. ఈ మేరకు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది సీఐడీ. అమరావతిలో అసైన్డ్ భూముల కోసం చట్ట వ్యతిరేకంగా జీఓ 41 తీసుకువచ్చారన్న సీఐడీ..ఈ జీవో ఏపీ అసైన్డ్ భూముల బదిలీ నిషేధ చట్టం, ఏపీ సీఆర్డీఏ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదని పేర్కొంది. చంద్రబాబు పిటిషన్ కొట్టేయాలని కోరింది సీఐడీ. అసైన్డ్ భూముల విషయంలో…
బిజేపి నాయకులపై హీరో సిద్దార్థ్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ సందేశాలు వచ్చాయని, అంతేగాక అత్యాచారం బెదిరిపులు కూడా వచ్చాయని హీరో సిద్దార్థ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో తమిళనాడు బిజేపి, ఈ హీరో కు మధ్య మాటల యుద్దం మొదలైంది. ఈ వివాదం కాస్త దేశ వ్యాప్తంగా వివాదాస్పదం అయింది. అటు తేజస్వి సూర్యను కూడా సిద్దార్థ్ టార్గెట్ చేశాడు. తేజస్వి సూర్యను టెర్రరిస్ట్ తో పోల్చాడు సిద్దార్థ్.…
కోవిడ్ నియంత్రణ పై సమీక్షలో సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో కోవిడ్ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు ఇవ్వాలి. అలాగే ఎంప్యానెల్ చేసిన ఆస్పత్రుల్లో విధిగా 50 శాతం బెడ్లు ఇవ్వాలి అని తెలిపారు. అంత కంటే ఎక్కువ రోగులు వచ్చినా తప్పనిసరిగా చేర్చుకోవాలి. టెంపరరీ ఎంప్యానెల్ ఆస్పత్రుల్లో కూడా 50 శాతం బెడ్లు ఇవ్వాలి. కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్ ఎంప్యానెల్ ఆస్పత్రులూ ఆ బెడ్లు ఇవ్వాలి. అందుకోసం ఆ ఆస్పత్రులను…
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది. అయితే ఈరోజు 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,16,367 శాంపిల్స్ పరీక్షించగా 22,204 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లోనే కోవిడ్‌తో 85 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో 11,128 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్…
కరోనా వాక్సినేషన్ పై ప్రధాని మోడీకి లేఖ రాయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానికి వాక్సిన్ డోసుల ను త్వరగా కేటాయించాలని లేఖ రాయనున్నారు సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి. 45 ఏళ్ళు పైబడిన వారికి వాక్సినేషన్ లో ప్రాధాన్యం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు నుండి రప్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు. అలాగే రేపటి నుండి…
ఏపీలో కోవిడ్ పరిస్థితులు, ప్రభుత్వ చర్యలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్బంగా ఏపీలో కోవిడ్ పరిస్థితులపై ఎమికస్ క్యూరీ ఏర్పాటుకు అదేశాలు ఇచ్చింది హైకోర్టు. గంటన్నర పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆక్సిజన్, బెడ్లు, టెస్టులు, రిపోర్టులు, డ్రగ్స్, వ్యాక్సినేషన్ పై సమగ్ర వివరాలతో అఫిడవిట్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆక్సిజన్ నిల్వలు ఎలా ఉన్నాయి, ఎంత మేరకు సరిపోతాయి, ఏయే పాయింట్స్ నుంచి ఎంత ఉత్పత్తి చేస్తున్నారని…
మంగళగిరి సిఐడి కార్యాలయమలో మూడోసారి విచారణకు మాజీమంత్రి దేవినేని ఉమా హజరయ్యారు. ఈ సందర్బంగా దేవినేని ఉమా మాట్లాడారు. రెండు రోజుల పాటు రోజుకు 9 గంటల పాటు విచారణ చేశారని..మళ్లీ మూడో రోజు విచారణకు రావాలని పిలిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివేకానంద హత్య కేసులో విజయసాయిరెడ్డిని, సాక్షి కొమ్మినేని శ్రీనివాసరావును విచారణ జరిపితే ఈపాటికి నిజాలు తెలిసేవని.. 41 క్రింది నాకు హైకోర్టు బెనిఫిట్స్ ఇస్తే అధికారులు దాన్ని కాల రాస్తున్నారని ఫైర్…