ఆనందయ్య మందు పంపిణీ ఎవరు అడ్డుకున్నా దుర్మార్గం. ఆనందయ్య తో బలవంతంగా మందు తయారు చేయించి వైసీపీ ఎమ్మెల్యేలు వారికి కావాల్సిన తెలంగాణ వ్యాపారస్తులకు పంచుకుంటున్నారు అని మాజీ మంత్రి సోమిరెడ్డి అన్నారు. తాజాగా ఎన్టీవీతో మాట్లాడిన ఆయన… అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని కృష్ణపట్నం వచ్చే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆనందయ్య ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేదు…ఆయన్ని ప్రజలు కాపాడుకుంటారు. సెకండ్ ఫేజ్ లో ప్రజలు చనిపోతుంటే….ఆనందయ్య మందుకి కోవిడ్ థర్డ్ ఫేజ్ లో అనుమతి ఇస్తారా… మందు తయారీకి ప్రభుత్వం రేపటి నుండి అనుమతి ఇవ్వాలి అని తెలిపారు. ఆనందయ్య మందు కి ఎమ్మెల్యే బొమ్మలు వేసుకుని పంచుకుంటున్నారు. ఆయన ఎక్కడ ఉన్నాడో చెప్పలేక పోతున్నాడు. ఆనందయ్య విషయం ఒక్క సర్వేపల్లికి సంబంధించింది కాదు….జిల్లా మంత్రులుకు ప్రజల ప్రాణాలు కాపాడే గడ్స్ లేవా.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రాష్ట్రంలో ఉందా…లేదా…అని అనుమానం కలుగుతోంది. మందు పంపిణీ చేతకాదని జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు చెబితే….ఆనందయ్య మందు మేము పంపిణీ చేస్తాం. ఒక ఎమ్మెల్యేని కాదని ఒక ఊరికి వెళ్లే ధైర్యం మంత్రులు, అధికారులకు లేదు అని పేర్కొన్నారు.