రైతుల ఖాతాల్లోకి 1820.23 కోట్ల పరిహారం : సిఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 15.5లక్షల మంది రైతులకు రూ. 1820.23 కోట్ల బీమా పరిహారాన్ని అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుందని.. ఈ నెలలోనే రైతుల కోసం రైతు భరోసా కింద నేరుగా వారి ఖాతాల్లోకి 3,928 కోట్లు పంపామని.. ఇదే నెలలోనే 15.5 లక్షల మందికి రైతులకు మేలు జరిగేలా రూ.1820.33 కోట్లు ఇవ్వగలుగుతున్నామని పేర్కొన్నారు. ఈ నెలలోనే రైతులకోసం రూ.5748 కోట్లు ఇవ్వగలిగామని.. మన రాష్ట్రంలో 62 శాతం ప్రజలు వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు.
మనకు ఆహార భద్రతను ఇవ్వడమే కాక 62 శాతం మందికి ఉపాధిని కల్పిస్తోందని.. ఇలాంటి సందర్భాల్లో రైతు బాగుంటేనే, రైతు కూలీ కూడా బాగుంటాడని వెల్లడించారు. 2020 ఖరీఫ్‌లో వర్షాలు, తుపాన్లు, చీడపీడల కారణంగా నష్టపోయిన 15.5 లక్షల మంది రైతులకు ఇప్పుడు వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద మేలు జరుగుతోందన్నారు. లంచాలు, వివక్షలేకుండా, పారదర్శకంగా, నేరుగా బటన్‌నొక్కిన వెంటనే రైతన్నఖాతాల్లోకి డబ్బును పంపిస్తున్నామని పేర్కొన్నారు. ఉగాది రోజున పంచాంగం కర్తలు తెలిపిన విధంగా, వాతావరణ శాఖ చెప్పిన విధంగా కూడా ఈ ఏడాది కూడా చక్కటి వర్షాలు కురిసి రైతన్నలకు మంచి పంటలు పండాలని కోరుకుంటున్నానని సిఎం జగన్ వెల్లడించారు.
Also Read
తాజావార్తలు
-
Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
-
Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
-
Explainer: రోజురోజుకీ మరింత పవర్‌ఫుల్‌గా మారుతున్న AIతో మనిషి ఉనికికే ముప్పు రానుందా?
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
Kareena – Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
ట్రెండింగ్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!