రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే వున్నాయి. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశించింది కేఆర్ఎంబీ. రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకోవద్దని రెండు రాష్ట్రాల సీఎస్లకు లేఖ రాసింది. ఇప్పటికే రాసిన లేఖలపై ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో రెండు రాష్ట్రాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది బోర్డు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని రెండు తెలుగు రాష్ట్రాలకు ఆదేశించింది కేఆర్ఎంబి. ఈ సంవత్సరం మే నెల వరకు తెలంగాణకు మూడు…
1. ‘అందరి కోరిక అదే అయితే.. దేశం కోసం కొత్త పార్టీ పెడతా అన్నారు సీఎం కేసీఆర్. ఈ దేశం కోసం ముందు కదలాల్సింది దేశ ప్రజలే. జనం ప్రభంజనమైతే.. ఎవరూ అడ్డుకోలేరు..ప్రజలు కలిసి వస్తే.. నాయకులు కదిలి వచ్చే పరిస్థితి వస్తుంది. కఠోర సమైక్యవాదినన్న చంద్రబాబు జై తెలంగాణ అనలేదా?సమైక్యవాద పార్టీ సీపీఐ జై తెలంగాణ అనలేదా?అన్నారు కేసీఆర్. 2 దేశంలో ఉన్న దళితుల బాగోగుల కోసమే కొత్త రాజ్యాంగం రావాలని తాను కోరుకుంటున్నట్లు తెలంగాణ…
ఈమధ్యకాలంలో అడవుల్లో పులులు రోడ్లమీదకు వచ్చేస్తున్నాయి. జనాన్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంచారం సంచలనం రేపుతున్నాయి. కొంతమంది వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో పులులు సంచారం చేస్తున్నాయనే వీడియోలు ప్రజలను దడ పుట్టిస్తున్నాయి. గిద్దలూరు నల్లమల అటవీ ప్రాంతంలో పులులు సంచరించినట్లుగా కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేసారు. వీడియోలు ప్రస్తుతం ఆ ప్రాంత ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.…
గడిచిన ఐదేళ్లలో దేశంలో 655 పోలీస్ ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. ఇందులో ఛత్తీస్గఢ్లో అత్యధికంగా 191 కేసులున్నాయని ఆయన చెప్పారు. జనవరి 1, 2017 నుండి జనవరి 31, 2022 మధ్య కాలంలో ఈ ఎన్కౌంటర్లు జరిగాయన్నారు. 117 ఉత్తరప్రదేశ్లో, అసోంలో 50, జార్ఖండ్లో 49, ఒడిశా 36, జమ్ముకాశ్మీర్ 35, మహారాష్ట్ర 26 ఎన్కౌంటర్ ఘటనలు చోటుచేసుకున్నాయని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ లోక్సభలో అడిగిన…
ప్రధాని మోడీ పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ప్రజల్ని అవమానించారని టీఆర్ఎస్ నేతలు ఆగ్రహంతో వున్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, తలసాని, ఎర్రబెల్లి, ఎంపీలు బీజేపీ నేతల్ని టార్గెట్ చేశారు. తాజాగా మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా బీజేపీ తీరుని ఎండగట్టారు. ఇది చాలా అవమానకరం. తెలంగాణ ప్రజల దశాబ్దాల స్ఫూర్తిదాయక పోరాటాన్ని మరియు త్యాగాలను ప్రధాని మోడీ పదే పదే అవమానిస్తున్నారు. ప్రధాని మోడీచేసిన అసంబద్ధ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను…
మోడీ కామెంట్లతో తెలుగు రాష్ట్రాలు హీటెక్కాయి. రాష్ట్ర విభజన జరిగి ఏడున్నరేళ్ళు పూర్తవుతున్నా మోడీ విభజనపై మంటలు రాజేశారు. పనిలో పనిగా కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు మోడీ. దీనిపై కాంగ్రెస్ నేతలు తెలుగు రాష్ట్రాల్లో నిరసనలకు దిగారు. గాంధీ భవన్ ముందు ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దగ్దం చేశారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్ర విభజన, కాంగ్రెస్ పై మోడీ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు దిగారు. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్లో కీలక వ్యాఖ్యలు చేశారు…
ఉత్తరాది గాన కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ ఇక లేరు. ఆమె వయసు 92 ఏళ్ళు. తీవ్ర అస్వస్థతతో గత కొన్నాళ్ళుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు లతా మంగేష్కర్. ఆసేతుహిమాచల పర్యంతం ఆబాలగోపాలాన్నీ అలరించిన గానకోకిల లతా మంగేష్కర్. ఆమె ఆకస్మిక మరణానికి యావత్ దేశం నివాళులర్పిస్తోంది. ప్రైవేటు వైద్య కళాశాలలు, డీమ్డ్ వర్సిటీల్లో రుసుములపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది జాతీయ వైద్య కమిషన్. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ…
మేషం :- బంధువుల రాకపోకలు సంతృప్తినిస్తాయి. అనుకోని కారణాల వల్ల ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఏ విషయంలోను మొహమాటాలకు పోకుండా మీ నిర్ణయం ఖచ్చితంగా తెలియజేయటం శ్రేయస్కరం. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు లాభదాయకం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృషభం :- దైనందిన కార్యక్రమాలు అన్నీ సకాలంలో పూర్తవుతాయి. భూ వివాదాలు, ఆస్తి వ్యవహరాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆగిపోయిన పనులు పునఃప్రారంభిస్తారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత అవసరం. గృహానికి కావలసిన వస్తువులను…
2022-23కు గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే ఈ బడ్జెట్ పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని ఆయన అన్నారు. రైతులు, పేదల కోసం ఏం చేస్తున్నారో చెప్పలేదన్నారు. వేతన జీవులకు మొడి చేయి చూపారన్నారు. నదుల అనుసంధానంపై కేంద్ర ప్రణాళికలను స్వాగతిస్తున్నామన్నారు. డిజిటల్, సోలార్, ఎలక్ట్రికల్ వెహికిల్ రంగంలో సంస్కరణలు మంచి పరిణామం అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు సాధించడంలో మరోసారి వైసీపీ…
ప్రభుత్వ విధానాలతోనే రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని టీడీపీ ఏపీ అధ్యక్షడు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. పెడనలో చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధకరమన్నారు. ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు జగన్ సర్కార్ ఉద్దరించింది ఏం లేదని మండి పడ్డారు. టీడీపీ హయాంలో చేనేతలకు ప్రోత్సాహకాలు, రాయితీలు, రుణాలు, వడ్డీ రాయితీలు చాలా ఇచ్చామన్నారు. సొంత మగ్గం లేకున్నా రిబేటుతో సహా ఏడాదికి రూ.…