కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు బడ్జెట్-2022ను ఆవిష్కరించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా సీఐఐ మాజీ అధ్యక్షడు రామకృష్ణ బడ్జెట్ పై మాట్లాడారు. ఇది చాలా మంచి బడ్జెట్ అన్నారు. పన్నుల్లో పెద్దగా మార్పులు లేవన్నారు. మౌళిక, రవాణా రంగాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టారన్నారు. రాష్ట్రాలకు ఇచ్చే రుణాల మొత్తాలను పారిశ్రామిక అభివృద్ధిపై పెడితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. పరిశ్రమలకు నిధులు ముఖ్యమన్నారు. డిజిటల్ ఎడ్యూకేషన్కు…
ఆంధ్ర ప్రదేశ్లో ఉద్యోగులు, ప్రభుత్వానికి మధ్య పీఆర్సీపై ఘర్షణ వాతావరణం కొనసాగుతుంది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ తమనకు సమ్మతంగా లేదని ఉద్యోగ సంఘాలు నిరసనలకు పిలుపునివ్వడంతో పాటు సమ్మెకు కూడా పిలుపునిచ్చారు. అయితే ఈనేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. విద్యుత్ ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలను చెల్లిస్తామని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. Read Also: రాష్ట్రపతి కోవింద్ను కలిసిన నిర్మలాసీతారామన్ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించిన విధంగానే…
నేరం చేసిన వారెవ్వరిని వదిలి పెట్టబోమని హోం మంత్రి సుచరిత స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుడారు. నేరాలు జరగటం లేదని మేం చెప్పడం లేదు.. నేరం జరిగితే ప్రభుత్వం ఎంత వేగంగా స్పందిస్తుందో, నిందితులను ఏ విధంగా కఠినంగా శిక్షిస్తుందో చూడాలి. పార్టీ ఏదైనా.. మహిళలపై చేయి వేస్తే ఉపేక్షించే ప్రభుత్వం మాది కాదని సుచరిత అన్నారు. గుంటూరు బాలిక వ్యభిచారం కేసులో 46మందిని అరెస్టు చేశామని సుచరిత అన్నారు. విజవాడలో…
ఉద్యోగులు సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉరుకోబోమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు డిమాండ్లు పరిష్కరిస్తేనే ఉద్యోగులు చర్చలకు వస్తామని చెబుతున్నారన్నారు. జీవోలు విడుదల అయినందున ప్రభుత్వం కొత్త జీతాలను ఇస్తుందన్నారు. ఉద్యోగులు ముఖ్యమంత్రి పై తూలనాడి మాట్లాడితే సంఘం నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. మేము కూడా మాట్లాడితే మరింత ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని మంత్రి…
ఏపీ పీఆర్సీ రగడ సామాన్య ఉద్యోగులను తీవ్ర ఆందోళనలకు గురి చేస్తున్నాయి. ఓ వైపు ప్రభుత్వం చర్చలు అంటూనే .. తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నాయి. మరోవైపు ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లు నేరవేరిస్తేనే చర్చలకు వెళ్తామంటూ భీష్మించుకుని ఉన్నారు. దీంతో సగటు ఉద్యోగులు అయోమయంలో ఉన్నారు. ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సు పెంపునకు సంబంధించి ఇంకా జీవో ఇవ్వకపోవడంతో అయోమయం నెలకొన్నది. Read Also: ఎన్జీవో హోంలో వైద్యారోగ్య శాఖ ఉద్యోగుల భేటీ ఇప్పటికే ఆయా…
విజయవాడలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలిక ఆత్మహత్య చేసుకోవడం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కలకలకం రేపిన సంగతి తెల్సిందే. ఆమె ఆత్మహత్య విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు దేశం పార్టీ నేత వినోద్ జైన్ ను ఆ పార్టీ ఇప్పటికే సస్పెండ్ చేసింది. మరో పక్క తెలుగు దేశం పార్టీ నేతలపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ నేపథ్యంలో బాలిక ఆత్మహత్య ఘటన పై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి కూడా తన…
ప్రభుత్వం అందించే వివిధ రకాల ప్రయోజనాలు పొందేందుకు అర్హతలుండాలి. అన్ని అర్హతలుండి కూడా ఠంచనుగా వస్తున్న పింఛన్ ఆగిపోతే వారి పరిస్థితి ఎలా వుంటుంది? కోర్టుల ద్వారా న్యాయం జరిగితే ఆ ఆనందానికి అవధులే వుండవు. తన పింఛను కోసం కోర్టుకెక్కిన ఓ వృద్ధురాలు విజయం సాధించింది. పింఛన్ వెంటనే పునరుద్ధరించడంతోపాటు ఎప్పటి నుంచి పింఛను ఆపేశారో ఆ మొత్తం కూడా లెక్కకట్టి ఇవ్వాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నావూరుపల్లికి…
విజయవాడ బాలిక ఆత్మహత్య ఘటన పై హోంమంత్రి మేకతోటి సుచరిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. టీడీపీ నాయకుడు వినోద్ జైన్ లైంగిక వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. 14 ఏళ్లు ఉన్న బాలిక భవనం మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడం మనసును కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వినోద్ జైన్ ఎంత దారుణమైన లైంగిక వేధింపులకు గురిచేసాడో, మానసిక వేదనకు గురిచేసాడో బాలిక ఆత్మహత్యను బట్టి…
ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారి ఆత్మహత్య చేసుకుంది, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. లైంగిక వేధింపులకు గురి చేసిన వినోద్ జైన్ గురించి ఎందుకు చెప్పలేకపోయిందో ఆ చిన్నారి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన గురించి ఎవరికైనా చెబితే ఇంట్లో వాళ్లని ఏమైనా చేస్తామని భయపెట్టాడా..? వినోద్ జైన్ మందబలం చూసి భయపడిందా..? వినోద్ జైన్ కు శిక్ష పడాలనే ఉద్దేశంతోనే వివరంగా సూసైడ్ నోట్ రాసిందని వాసిరెడ్డి పద్మ అన్నారు.…
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుంది. నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 10,310 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా శనివారంతో పోలిస్తే.. ఈ రోజు రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు 1,263 కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా…