Astrology: మార్చి 11, శుక్రవారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం :– ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ప్రైవేటు సంస్థలలోని వారికి, పత్రికా, వార్తా మీడియా వారికి ఏకాగ్రత ముఖ్యం. రావలసిన ధనం అందటంతో పొదుపు పథకాల దిశగా ఆలోచనలు సాగిస్తారు. వ్యాపారాల్లో ఎదురైన పోటీని తట్టుకోవటానికి ఆకర్షణీయమైన పథకాలు అమలుచేయండి.
వృషభం :- ఆర్థిక, కుటుంబ సమస్యలకు చక్కని పరిష్కారం దొరుకుతుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి పనిభారం అధికం. ప్రేమికులలో నూతనోత్సాహం నెలకొంటుంది. ఏజెంట్లు, మార్కెటింగ్ రంగాల వారుటార్గెట్లు పూర్తి కాగలవు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలీయమవుతుంది. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు.
Also Read
- AP Economic Regions: యువతకు లక్షలాది ఉద్యోగాలే లక్ష్యం.. మూడు ఎకనమిక్ రీజియన్లపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష
- AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల సందడి.. తుది దశ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు..!
- Akvan Cyclone Alert: మళ్లీ ఉత్తరాంధ్ర తీరంవైపు అక్వాన్ తుఫాన్..! మరో 36 గంటలు అలర్ట్
- AP Panchayat Elections: తొలి దశలో బరిలో 21 వేల మందికి పైగా సర్పంచ్ అభ్యర్థులు.. 87 వేల వార్డు అభ్యర్థులు
మిథునం :- సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. శారీరక శ్రమ, మితిమీరిన ఆలోచనలవల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. స్త్రీలకు అయిన వారి నుంచి కావలసిన సమాచారం అందుతుంది. అధికారులకు కిందిస్థాయి సిబ్బందితో చికాకులు తప్పవు. మొహమ్మాటాలకు పోయి కోరి కష్టాలు తెచ్చుకున్న వారవుతారు.
కర్కాటకం :- ఉద్యోగస్తులకు యూనియన్ కార్యకలాపాల వల్ల క్షణం తీరిక ఉండదు. ఒక వేడుకను ఘనంగా చేయటానికి సన్నాహాలు మొదలెడతారు. వృత్తి వ్యాపారాల్లో స్థిరపడటంతో పాటు ఇతరులకు మార్గదర్శకమవుతారు. అవివాహితులకు శుభవార్తలు అందుతాయి. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి.
సింహం :- ఆస్తి పంపకాలు, కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. మీ పనులు, కార్యక్రమాలకు చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉన్నతస్థాయి అధికారులు పై సంపాదన పట్ల ఆసక్తి తగ్గించుకోవటం క్షేమదాయకం. కొంతమంది మిమ్ములను ఇరకాటానికి గురిచేసేందుకు యత్నిస్తారు.
కన్య :- స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగ, వ్యాపారాల్లో తలెత్తిన ఆటంకాలను తెలివిగా అధికమిస్తారు. మీకెదురైన అనుభవంతో మనస్సు మార్చుకుంటారు. అనుకున్న పనులు మొదలెట్టే సమయానికి ఏదో ఒక అవాంతరం వచ్చిపడుతుంది.
తుల :- స్త్రీలలో సంపాదన పట్ల ఆసక్తి మరింత బలపడుతుంది. శారీరక శ్రమ, విశ్రాంతి లోపం వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. స్థిరచరాస్తులు విక్రయించాలనే ఆలోచన విరమించుకోవటం మంచిది. కొన్ని విషయాల్లో మీ ప్రమేయం లేకున్నా మాటపడక తప్పదు. ఉద్యోగస్తుల శ్రమ, సమర్థతలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
వృశ్చికం :- ముఖ్యుల గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు ఏ విషయంలోను ఆసక్తి పెద్దగా ఉండదు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కొన్ని అవకాశాలు అనుకోకుండా కలిసివస్తాయి. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారులతో కొత్త సమస్యలు అధికం. బంధువులను, ప్రముఖులను కలుసుకుంటారు.
ధనస్సు :- మందులు, రసాయనాలు, ఆల్కహాలు, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. బంధు మిత్రుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. తరుచు సన్మానాలు, సభల్లో పాల్గొంటారు. కీలకమైన వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహా పాటించండి. స్త్రీల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు శారీరకంగా బలం పుంజుకుంటారు.
మకరం :- వ్యాపారాల అభివృద్ధికి మరింతగా శ్రమించాలి. మీ యత్నాలకు కుటుంబీకులు, సన్నిహితుల ప్రోత్సాహం లభిస్తుంది. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టులకు అనుకూలం. వృత్తిపరంగా ఎదురైన ఆటంకాలను అధికమిస్తారు. ఉద్యోగస్తుల పదోన్నతులు, బదిలీలకు అధికారులు సిఫార్సు చేస్తారు.
కుంభం :- కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లుల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. విద్యార్థులకు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత అవసరం. బంధువుల వల్ల కార్యక్రమాలకు స్వల్ప ఆటంకాలెదురవుతాయి. కార్యసాధనలో పట్టు, ఓర్పు ముఖ్యమని గమనించండి. ప్రముఖ కంపెనీల షేర్ల విలువలు పెరిగే సూచనలున్నాయి.
మీనం :- వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు రూపొందిస్తారు. నిరుద్యోగులకు సమాచార లోపం వల్ల ఒక అవకాశం చేజారిపోతుంది. విద్యార్థినులలో భయాందోళనలు అధికమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు స్వయంగా చూసుకోవటం మంచిది. గృహ నిర్మాణాలలో స్వల్ప అడ్డంకులు, చికాకులు ఎదుర్కుంటారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
EPFO New Rules 2026: పీఎఫ్ ఖాతాదారులకు జాక్పాట్.. ఇకపై 90% డబ్బు మీ చేతికే! కొత్త రూల్ ఇదే..
-
UGC NET Exam Schedule: 87 సబ్జెక్టులు.. 6 రోజులు.. 2 షిఫ్టులు! యూజీసీ నెట్ 2026 షెడ్యూల్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
Maharashtra: అక్రమ సంబంధం.. సుపారీ హత్య.. భర్త స్నేహితురాలిని చంపించిన భార్య..
-
Telangana Jobs : నిరుద్యోగులకు మరో గుడ్న్యూస్.. ఆయుష్ విభాగంలో 70 ఉద్యోగాలు
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!