Anushka Shetty : అనుష్క ఏం చేస్తుంది.. సినిమా కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడినట్టేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో ఒకప్పుడు వెలిగిపోయిన స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కెరీర్ ఇప్పుడు సందిగ్ధంలో పడినట్లు కనిపిస్తోంది. గతేడాది విడుదలైన ఆమె భారీ ఆశలు పెట్టుకున్న చిత్రం ‘ఘాటీ’ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. దాదాపు రూ. 45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామా, కనీసం పది కోట్ల వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. దీంతో ఈ ‘బొమ్మాళీ’ కెరీర్ ముగిసినట్టేనా అన్న విశ్లేషణలు మొదలయ్యాయి. ‘ఘాటీ’ వచ్చి ఏడు నెలలు దాటినా, ఇప్పటివరకు ఆమె మరో ప్రాజెక్ట్‌పై సంతకం చేయలేదు. సాధారణంగా అనుష్క సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే నమ్మకం ఉండేది. కానీ ‘ఘాటీ’ ఫలితం తర్వాత ఆమెతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీయడం భారీ రిస్క్ అని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే ఆమెకు కొత్త ఆఫర్లు ఇవ్వడానికి మేకర్స్ వెనకాడుతున్నట్లు సమాచారం.
Also Read : Tollywood : ఖాళీగా దర్శనమిస్తున్న థియేటర్స్.. పవన్ & రణవీర్ ఆదుకుంటారా?
Also Read
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి సీనియర్ హీరోలకు అనుష్కనే ఫస్ట్ ఛాయిస్. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. నయనతార వంటి స్టార్ హీరోయిన్లు ఇప్పటికీ సీనియర్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే అనుష్క విషయంలో మాత్రం సీనియర్ హీరోలు కూడా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఆమెకు సరైన జోడీ కుదరకపోవడం కూడా ఒక కారణం కావొచ్చు. ‘సైజ్ జీరో’ సినిమా కోసం పెరిగిన బరువు ఇప్పటికీ అనుష్క కెరీర్‌ను వెంటాడుతోంది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా ఆమె పాత రూపానికి రాలేకపోయారు. వెయిట్ తగ్గకపోవడం వల్ల గ్లామర్ పాత్రలకు ఆమె దూరం కావాల్సి వచ్చింది. రెండు, మూడేళ్లకు ఒక సినిమా చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనుష్క, ఈ సుదీర్ఘ గ్యాప్ వల్ల క్రేజ్ కోల్పోతున్నారా అన్న అనుమానం కలుగుతోంది. ప్రస్తుతం అనుష్క చేతిలో ‘కతనార్’ అనే ఒక మలయాళ పీరియడ్ సినిమా మాత్రమే ఉంది. తెలుగులో ఆమె నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే దానిపై క్లారిటీ లేదు. మరి ‘జెజమ్మ’గా ప్రేక్షకులను అలరించిన అనుష్క, మళ్ళీ ఒక పవర్‌ఫుల్ రోల్‌తో కంబ్యాక్ ఇచ్చి విమర్శకుల నోళ్లు మూయిస్తుందా? లేక ఇలాగే సైలెంట్ అయిపోతుందా? అనేది కాలమే నిర్ణయించాలి.
తాజావార్తలు
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
-
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
-
Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
-
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!