విజయవాడ బాలిక ఆత్మహత్య ఘటన పై హోంమంత్రి మేకతోటి సుచరిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. టీడీపీ నాయకుడు వినోద్ జైన్ లైంగిక వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. 14 ఏళ్లు ఉన్న బాలిక భవనం మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడం మనసును కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వినోద్ జైన్ ఎంత దారుణమైన లైంగిక వేధింపులకు గురిచేసాడో, మానసిక వేదనకు గురిచేసాడో బాలిక ఆత్మహత్యను బట్టి…
ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారి ఆత్మహత్య చేసుకుంది, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. లైంగిక వేధింపులకు గురి చేసిన వినోద్ జైన్ గురించి ఎందుకు చెప్పలేకపోయిందో ఆ చిన్నారి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన గురించి ఎవరికైనా చెబితే ఇంట్లో వాళ్లని ఏమైనా చేస్తామని భయపెట్టాడా..? వినోద్ జైన్ మందబలం చూసి భయపడిందా..? వినోద్ జైన్ కు శిక్ష పడాలనే ఉద్దేశంతోనే వివరంగా సూసైడ్ నోట్ రాసిందని వాసిరెడ్డి పద్మ అన్నారు.…
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుంది. నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 10,310 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా శనివారంతో పోలిస్తే.. ఈ రోజు రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు 1,263 కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా…
టీడీపీ నాయకుల మీద కంట్రోల్ లేదని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. 14 ఏళ్ల చిన్న పాప లైంగిక వేధింపులకు గురైందని, మేడ మీద నుంచే దూకే ముందు అటు ఇటు తిరిగింగిందని వాసిరెడ్డ పద్మ ఆరోపించారు. ఆ బాలిక మరణం తప్ప గత్యంతరం లేదని దూకి ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. దీనికి కారణమైన వినోద్ జైన్ ను సస్పెండ్ చేస్తే సరిపోతుందా అంటూ వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. వినోద్ జైన్ ఎలాంటి వాడో బెజవాడ…
ఆంధ్రప్రదేశ్లోకొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నాని NDMA,మాజీ వైస్ ఛైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో 10 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉండేవి. ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్టం 1974లోని నిబంధనల ప్రకారం, మొత్తం జిల్లాల సంఖ్యను 26కి తీసుకొని 13 కొత్త జిల్లాలను రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపాదించిందన్నారు. మెరుగైన పరిపాలన వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి ప్రయోజనాల…
హిందూ దేవాలయాల వద్ద అన్యమత చిహ్నాలు దారుణం.. వాటిని వెంటనే తొలగించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామంలో తిరుమల స్వామి దేవాలయం వద్ద అన్యమత చిహ్నాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. శతాబ్దాలుగా సంతానం కలగని దంపతులకు ఇక్కడకొచ్చి గిరి ప్రదక్షిణ చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందనే విశ్వాసం భక్తుల్లో ఉందన్నారు. Read Also: నేరగాళ్లకు ఏపీ ఫ్రెండ్లీ స్టేట్గా…
మహిళలపై అత్యాచారాలలో ఏపీ రెండవ స్థానంలో ఉందని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. ఈ సందర్భంగా గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. సొంత చెల్లికి రక్షణ ఇవ్వలేని వ్యక్తి సీఎం జగన్ అని, ఇక రాష్ట్ర మహిళలకు ఏం ఇస్తాడు అంటూ విమర్శించారు. రాష్ట్రంలో నేరగాళ్లకు ప్రెంఢ్లీ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ మారిపోయిందని దుయ్యబట్టారు. ఏపీలో మహిళలు బయటకు రావడానికి భయపడుతున్నారని ఆమె అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అత్యాచారం చెయ్యాలంటే భయపడే పరిస్థితి చంద్రబాబు కల్పించారన్నారు.…
కోవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అధికారులకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో కోవిడ్ విస్తరణ పరిస్థితులను సీఎం జగన్ కు అధికారులు వివరించారు. కేసులు నమోదు అవుతున్నా ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉన్నవారి సంఖ్య తక్కువగా ఉందని తెలిపిన అధికారులు. 1.06 లక్షలకు పైగా కేసుల్లో 2709 మందే ఆస్పత్రుల్లో చేరారని తెలిపిన అధికారులు. ఇందులో ఐసీయూలో చేరిన వారు కేవలం 287 మంది మాత్రమేనని వెల్లడించారు.…
తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం చూపగల వ్యక్తి ఎన్టీఆర్ అని మంత్రి పేర్ని నాని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ను ఓ ప్రాంతానికో.. కులానికో పరిమితం చేయొద్దని మంత్రి పేర్నినాని అన్నారు. ప్రధానులనే నియమించి చక్రం తిప్పానన్న చంద్రబాబు.. ఎన్టీఆర్కు భారతరత్న ఎందుకు ఇప్పించలేకపోయారని ప్రశ్నించారు? ఎన్టీఆర్ పేరుతో జిల్లా పెట్టాలన్న ఆలోచనను చంద్రబాబు ఎందుకు చేయలేదని మండిపడ్డారు. కొత్త జిల్లాల ఏర్పాటు అనేది రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం…
ఉద్యోగుల ఆందోళనలకు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త జిల్లాల ఏర్పాటు పై మాట్లాడారు. లోక్ సభ నియోజకవర్గ పరిధి, భౌగోళిక విస్తీర్ణం, జిల్లా ఆర్థికంగా అభివృద్ధి చెందగలిగే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కొత్త జిల్లాల ప్రతిపాదనలు చేశామని చెప్పారు. పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం గత ఏడాదిన్నరగా కొత్త జిల్లాల ఏర్పాటు కోసం కసరత్తు చేసి నిర్ణయం తీసుకుందన్నారు.…