ప్రస్తుతం జరగోబోతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఎన్టీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న 4 రాష్ట్రాల్లో యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో తిరిగి అధికారం బీజేపీదేనని స్పష్టం చేశారు. పంజాబ్‌లో హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని జీవీఎల్ అన్నారు. బీజేపీ కూటమికి ప్రజలు పంజాబ్‌లో అధికారం అప్పగిస్తారనే ఆశాభావంతో ఉన్నామన్నారు. ఏదిఏమైనా, పంజాబ్‌లో ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర…
తిరుమలలో కురిసిన భారీవర్షానికి భక్తులు తడిసిముద్దయ్యారు. ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో భక్తులు ఇబ్బందులు గురి అయ్యారు.. సెలవు రోజు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి వైకుంఠం కాంప్లెక్స్‌కు వెళ్లే భక్తులతో పాటుగా దర్శనం తర్వాత బయటకు వచ్చే భక్తులు తడిసిపోయారు. భారీవర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శ్రీవారి ఆలయ పరిసరాలు, మాఢ వీధులు, లడ్డూ వితరణ కేంద్రాల్లో స్వల్పంగా వర్షపు నీరు చేరుకుంది. వాన నీటిని బయటకు తోడే పనిలో…
రాయచోటి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా ప్రకటనను చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు తప్పు పడుతున్నారు. మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద రెవిన్యూ డివిజన్‌ను విభజించిన జగన్ ప్రభుత్వం మదనపల్లికి జిల్లా కేంద్రం విషయంలో మదనపల్లి ప్రజలకు అన్యాయం చేసిందని మాజీ మంత్రి అమర్నాథరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పడమటి ప్రాంత ప్రజలకు శ్రీ వెంకటేశ్వర స్వామిని దూరం చేసిందన్నారు. మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటన చేయకపోతే ఆందోళన తీవ్ర…
ఆంధ్రప్రదేశ్‌లో నూతన జిల్లాల ఏర్పాటు శుభ పరిణామమని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాల వికేంద్రీకరణ వలన ప్రజలకు మరింత మేలు కలుగుతుందన్నారు. చారిత్రక నేపథ్యం.. ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకోనే ప్రభుత్వం కొత్త జిల్లాలకు నామకరణం చేయడం అభినందనీయమన్నారు.మన దేశం అనేక అంతర్గత, బహిర్గత సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు. Read Also: నా ప్రసంగాలు యువత, సమాజంలో మార్పు తీసుకువస్తే చాలు: గరికపాటి నరసింహారావు దేశంలో మూడో వేవ్ కరోనా…
ప్రముఖ తెలుగు రచయిత, అవధాని, ఉపన్యాసకుడు గరికపాటి నరసింహారావు పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా ఆయన ఎన్టీవీతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలను ఎన్టీవీతో పంచుకున్నారు.నాకు పద్మశ్రీ అవార్డు రావడం సంతోషంగా ఉందని గరికపాటి అన్నారు. నా ప్రసంగాలు యువత, సమాజంలో మార్పు తీసుకువస్తే చాలన్నారు. పద్మశ్రీ అవార్డు కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని, కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల కృషి అభినందనీయమని ఈ సందర్భంగా గరికపాటి నరసింహరావు అన్నారు. Read Also: కొత్త…
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పరిపాలన సౌలభ్యం, సత్వర సేవలే లక్ష్యంగా కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు. ఎన్నికల హామీని అమలు చేస్తూ కొత్తగా 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ముఖ్య మంత్రి జగన్మోహన్రెడ్డి సారథ్యంలో నోటీఫికేషన్ విడుదల చేస్తూ కీలకమైన నిర్ణయం తీసుకున్నామని మంత్రి వివరించారు. Read Also: ఆంధ్ర రాష్ట్రాన్ని వివాదాలు, అప్పులు, అవినీతిమయం కానివ్వం:…
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలోని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. అనంతరం బీజేపీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను సోము వీర్రాజు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వివాదాలు, అప్పులు, అవినీతిమయం కానివ్వమని సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు సహజ వనరులను దోచుకుంటున్నారన్నారు. రాష్ట్రం నుంచి ట్రేడింగ్ చేసే మనస్తత్వాలు కలిగిన వారిని తరిమేస్తామన్నారు. దీనికోసం బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం…
విశాఖ నగర వైస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు తిప్పల నాగిరెడ్డి, వరుదు కళ్యాణి, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, నియోజకవర్గ సమన్వయ కర్తలు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. జాతీయ జెండాను మంత్రి అవంతి శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిందన్నారు. మారుమూల ప్రాంతాల నుంచి విశాక రావాలంటే ఐదు గంటల సమయం పడుతుందన్నారు.…
విజయవాడ ఉంగటూరు పోలీస్ స్టేషన్ ఉంగటూరు పోలీస్ స్టేషన్ నుండి సోము వీర్రాజు విడుదల అయిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు వైసీపీ పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ దెబ్బకి వైసీపీ ప్రభుత్వం, మంత్రి ఓడిపోయాడన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని మమ్ముల్ని ఆపాలని చూశారు. సంక్రాంతి సంబరాలు ఎలా జరపాలో మా కార్య కర్తలు గుడివాడ నానికి చూపించారని చురకలు అంటించారు. ఢిల్లీలో తోకలు పట్టుకుని తిరిగే పార్టీలు మాపై కామెంట్లు చేస్తున్నాయన్నారు.…