ఇవాళ, రేపు దేశ వ్యాప్తంగా భారత్ బంద్. సార్వత్రిక సమ్మెలో పాల్గొననున్న కార్మికులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. నిలిచిపోనున్న కార్యకలాపాలు.
ఇవాళ టర్కీలో రష్యా, ఉక్రెయిన్ ల మధ్య మరోసారి చర్చలు.
అనంతపురంలో నేడు ఎస్కేయూ పాలకమండలి సమావేశం.
*నేడు నెల్లూరు నగరంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన. వీపీఆర్.కన్వెన్షన్ సెంటర్ లో జరిగే మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప సభకు హాజరు కానున్న సీఎం జగన్. పాల్గొననున్న మంత్రులు, ఎం.ఎల్.ఏ.లు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె. ఇవాళ,రేపు సమ్మెలో పాల్గొంటున్న కార్మికులు, ప్రజాసంఘాలు.
నేడు విశాఖలో గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ పర్యటన. సింహాచలం వరాహాలక్ష్మి నర్సింహస్వామిని దర్శించుకోనున్న గవర్నర్.
నేడు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పున ప్రారంభం. యాదాద్రికి సీఎం కేసీఆర్, మహాకుంభ సంప్రోక్షణ లో పాల్గొననున్న సీఎం కేసీఆర్ దంపతులు. బేగంపేట విమానాశ్రయం నుంచి యాదాద్రికి ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లనున్న కేసీఆర్ దంపతులు.