టీడీపీ పుట్టి 40 ఏళ్ళు అయ్యిందని సంబరాలు చేసుకుంటున్నారు. ఇలా సంబరాలు చేసుకోవడం లో తప్పు లేదు. 1995లో ప్రజా నిర్ణయంతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ను గద్దె దించటం కూడా చూడాల్సిన కోణం.
అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ ఆవిర్భావం కూడా మీడియా మేనేజ్మెంట్ ఉంది. కానీ అప్పటి రాజకీయ అవసరం వేరు. అప్పుడు జర్నలిస్టుగా దగ్గరగా అన్ని పరిణామాలు చూసిన వాడిని. కానీ చంద్రబాబు హయాంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని తొక్కి పూర్తిగా వ్యవస్థలను తనకు అనుకూలంగా మార్చుకున్న తీరు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. జగన్ పూర్తిగా ప్రజాభిమానం తో ఆవిర్భవించిన నాయకుడు.ఇప్పుడు టీడీపీ అవసాన దశలో వెంటిలేటర్ పై ఉందన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల.