ఎంఐఎం బీజేపీకి బి టీం అన్నారు ఆప్ సౌత్ ఇన్ ఛార్జి సోమ్ నాథ్ భారతీ. ముస్లిం ఓట్లు చీల్చుతూ బీజేపీకి ఓవైసీ లాభం చేస్తున్నాడు. మా నెక్స్ట్ టార్గెట్ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్. కాశ్మీర్ పండిట్ల కోసం బీజేపీ ఏం చేసింది. కాశ్మీర్ ఫైల్స్ నిర్మాతకు డబ్బులు మాత్రమే కావాలి. యూట్యూబ్ లో పెడితే అందరూ ఫ్రీ గా చూస్తారు. కేసీఆర్ అవినీతి తెలంగాణలో చిన్నపిల్లలను అడిగిన చెప్తారు. పంజాబ్ లో కాంగ్రెస్ దళిత సీఎం…
గుంటూరు జిల్లాలో నకిలీ నోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. రోజుకో ప్రాంతంలో నకిలీ నోట్లు బయటపడుతుండడంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. ఒరిజినల్ నోట్లకు నకిలీ నోట్లకు తేడా తెలియకపోవడంతో జనం మోసపోతున్నారు. కొందరు కేటుగాళ్ళు ఈజీ మనీకోసం నకిలీ కరెన్సీ చలామణి చెయ్యడం మొదలుపెట్టారు. గ్రామీణ ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని నకిలీ కరెన్సీ చలామణి చేస్తూ జనాన్ని నిలువునా మోసం చేస్తున్నారు కేటుగాళ్లు. భారీ మొత్తంలో నకిలీ నోట్లు ప్రింటింగ్ చేసి మార్కెట్లోకి చలామణిలోకి తెస్తున్నారు. వినుకొండ…
తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అవకాశం వచ్చిందంటే చాలు తమ మాయాజాలం ప్రజలపై ప్రదర్శిస్తూ అకౌంట్లో డబ్బులు కొట్టేస్తున్నారు. ఒకప్పుడు ఏటీఎం సెంటర్లలో జనం రద్దీగా ఉండే సెంటర్లలో మాత్రమే జరిగే అకౌంట్ చోరీలు ఇప్పుడు నెట్ ఫోన్ల పుణ్యమా అని నేరుగా మన వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చి అకౌంట్లో సొమ్ము ఖాళీ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు….. గుంటూరు జిల్లాలో తాజాగా జరుగుతున్న అనేక ఘటనలు నష్టాల పాలు చేస్తున్నాయి. మీ ఆయనకు ఆరోగ్యం బాగా…
విద్యాలయాల్లో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో అవేర్ నెస్ ఆన్ యాంటీ ర్యాగింగ్’ కార్యక్రమం ఏర్పాటు చేసి ర్యాగింగ్ ఫై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ర్యాగింగ్ వల్ల సంభవించే అనర్థాల గురించి జిల్లాఎస్పీ రాహుల్ దేవ్ శర్మ అవగాహన కల్పించారు. ర్యాగింగ్ దాని వల్ల ఎదురయ్యే దుష్పరిణామాలపై అవగాహన లేకపోవడం వల్ల విద్యార్థులు తెలియకుండానే దాని వల్ల…
మహిళా సాధికారత, ఆర్ధికాభివృద్ధే జనసేన లక్ష్యం అన్నారు నాదెండ్ల మనోహర్. మహిళా ప్రాంతీయ కమిటీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ సిద్ధాంతాలను పునరుద్ఘాటించారు. ఆర్ధికంగా వెనకబడ్డ మహిళలకు ఏడాదికి లక్ష ఆదాయం వచ్చేలా వీర మహిళ విభాగం కృషి చేయాలన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాకో గ్రామం. మహిళా సాధికారత, ఆర్ధిక అభివృద్ధికి తోడ్పాటు అందించే విధంగా జనసేన పార్టీ కృషి చేస్తోంది. పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు మహిళా శక్తిని మరింత…
ఏపీ కౌన్సిల్ జరుగుతున్న తీరుపై విపక్ష టీడీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. కల్తీసారా వాస్తవాలు బయటకొస్తాయని ప్రభుత్వం భయపడుతోంది.రాష్ట్రంలో లభ్యమయ్యే మద్యంతో రసాయనాలు ఉన్నాయనే ల్యాబ్ రిపోర్టులు మా దగ్గర ఉన్నాయి. కొన్ని రసాయనాలు సైనేడ్ గా మారొచ్చనే అధ్యయనాలు ఉన్నాయి. ఇవన్నీ బయటకొస్తాయనే మమ్మల్ని దూషించి చర్చ నుంచి పారిపోతున్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించమంటే స్పీకర్ మార్షల్స్ ని రమ్మంటున్నారు. మంత్రులు బొత్స, కొడాలినాని తరహాలో మా సభ్యులు ఎవ్వరూ ప్రవర్తించట్లేదు. కౌన్సిల్ ఛైర్మన్ గా…
మనం కష్టపడి సంపాదించిన డబ్బుల్ని బ్యాంకుల్లో దాచుకుంటాం. కంచె చేనుమేసినట్టుగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బులు భద్రమేనా..? మొన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు, తాజాగా డిసీసీ బ్యాంక్ లో కోట్ల రూపాయలు దారిమళ్లడంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. నెలలు గడిచినా కోట్ల రూపాయల విషయం పసిగట్టకపోవడానికి లోపం ఎవ్వరిది.. ? మరి నిఘా వేయాల్సిన అధికారులేం చేస్తున్నట్టు… ? స్కాం జరిగాక రికవరీ కోసం తపన తప్ప.. కేసుల జోలికెళ్లడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల…
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ తాజా నిర్ణయం ఒకటి విమర్శల పాలవుతోంది. పన్నులు కట్టనివారిపై మునిసిపల్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై జనం మండిపడుతున్నారు. ఈనేపథ్యంలో కమిషనర్ వివరణ ఇచ్చారు. ఇళ్లలో సామాన్లు జప్తు వాహనాలపై కాకినాడ కమిషనర్ వివరణ ఇచ్చారు. నిన్న ప్రారంభించిన జప్తు వాహనాలను నిలిపివేశామన్నారు. సకాలంలో పన్నులు కట్టకపోతే ఇళ్లు జప్తు చేయడం ఎన్నో ఏళ్లుగా ఉందన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు జప్తు వాహనాలను ఏర్పాటు చేశామని, ప్రస్తుతం జప్తు వాహనాలు నిలిపివేశామని…
వైసీపీపై టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్నారు సోమిరెడ్డి. టీడీపీ నేతలు.. కొందరు అధికారుల ఫోన్లను వైసీపీ ట్యాప్ చేస్తుందని మా అనుమానం. ప్రభుత్వ పరంగా కాకుండా.. వైసీపీ పార్టీ పరంగా ఓ సాఫ్ట్ వేర్ ద్వారా ట్యాపింగుకు పాల్పడుతున్నారని మేం నమ్ముతున్నాం. దీనిపై గతంలోనే మా అనుమానాలు వ్యక్తం చేశాం. పెగాసెస్ స్పై వేర్ చంద్రబాబు కొనుగోలు చేశారన్నది ఓ పెద్ద బ్లండర్.…
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో భూ మాఫియా రెచ్చిపోయి కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వెదురుకుప్పం మండలం లోని కొంతమంది నాయకుల అండదండలతో ఫేక్ పట్టాదారు పాసు పుస్తకాలు తయారుచేసి విచ్చలవిడిగా దందా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఆళ్ల మడుగు, దేవరగుడిపల్లి, వెదురుకుప్పం, చుట్టుపక్కల ప్రాంతాలలో ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి, ఒక నాయకుడు ఏకంగా గుట్టని,చెరువుల్ని కూడా వదలకుండా గత కొన్ని సంవత్సరాలుగా తన సొంత ప్రయోజనాల కోసం వాడేశారు. తన పేరు…