ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది అవకాశం లేకుండా పోయింది. కొంతమంది పోలీసుల తీరు విమర్శలకు గురవుతోంది. బాపట్ల జిల్లా వేమూరు ఎస్సై అనిల్ కుమార్ మైనర్ బాలుడు షేక్ మొహమ్మద్ రఫీపై వ్యవహరించిన తీరు వివాదాస్పదం అవుతోంది. బుధవారం రాత్రి 9:30కి బాలుడు తలపై కత్తితో రెండు సార్లు కోశారు ఎస్సై అనిల్ కుమార్. సోమవారం యువకుల మధ్య గొడవ.. పోలీస్ స్టేషన్లో పంచాయతీగా మారింది. సెటిల్మెంట్ కి రావాలని మహమ్మద్ రఫీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు ఎస్సై అనిల్ కుమార్.
CM Jagan: స్వంత జిల్లాలో నేడు, రేపు సీఎం జగన్ పర్యటన
స్టేషన్ కి వచ్చిన వెంటనే రఫీని గదిలోకి తీసుకువెళ్లి చితకబాదారు ఎస్సై అనిల్ కుమార్.. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు. దీంతో సంతృప్తి చెందని ఎస్సై మరింత రెచ్చిపోయాడు. బాలుడు తలపై కత్తితో ఒకసారి కోశాడు కానీ తెగలేదని.. రెండో సారి కొయ్యటంతో తలపై గాయం..తల నుంచి రక్తపు దారలు. రక్తం కారుతున్నా బయటకు వెళ్ళటం కుదరదని, డాక్టర్ స్టేషన్ కి వచ్చి చికిత్స చేస్తాడని ఇక్కడే ఉండాలని హుకుమ్ జారీ చేశాడు ఎస్ ఐ. భయంతో రఫీ తండ్రి వద్దకు పరుగులు పెట్టాడు. గాయం చూసి తండ్రి ఆవేదన చెందగా సృహ కోల్పోయింది రఫీ తల్లి, ఒకసారిగా కింద పడటంతో తల్లి తలకి గాయం అయింది. ఆమెని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి.. అనంతరం గుంటూరు జీజీహెచ్ కి తరలించారు.
సెటిల్మెంట్ అవుతుందని గ్రామంలో పెద్దమనుషులు చెబితేనే వేమూరు పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చామన్నారు రఫీ తండ్రి మౌలాలి. తప్పు చేస్తే రెండు దెబ్బలు వెయ్యాలే కానీ ఇలా కత్తితో కొయ్యటం ఏంటని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు రఫీ అన్న మస్తాన్. ఈవ్యవహారం జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. బాలుడి పట్ల కర్కశంగా వ్యవహరించిన ఎస్ ఐ, కానిస్టేబుళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
China: వెంటాడుతున్న కరోనా.. 300పైగా కొత్త కేసులు