సోషల్ మీడియా ప్రభావం యువత మీద చాలా ఎక్కువగా వుంటోంది. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రాంలు చూసి యువత అదే విధంగా వీడియోలు తీస్తున్నారు. యూ ట్యూబ్ లో పెడుతున్నారు. కొన్నిసార్లు అవి వర్కవుట్ అవుతాయి. ఫ్రాంక్ వీడియోలు శృతి మించితే కటకటాలు లెక్కించడం ఖాయం అని నిరూపణ అయింది. చిత్తూరు జిల్లా పలమనేరులో అలాంటిదే జరిగింది. పలమనేరులో రోడ్డు పై వెళుతున్న విద్యార్థులను అమ్మాయిలను ఓ వింత ఆకారం ఏడిపించింది.
టెడ్డీబేర్, మిక్కీమౌస్ వేష ధారణతో రోడ్డుపై వెళుతున్న వారిని ఆటపట్టించడం మొదలెట్టాడు. విద్యార్ధినుల చేతుల్లో వస్తువులు, సెల్ ఫోన్లు లాక్కోవడం మొదలెట్టాడు. తొలుత ఇది సరదాగా అనిపించినా.. క్రమేపీ అది శృతిమించింది. విద్యార్ధినులను వేధిస్తున్న యువకుడు సయ్యద్ కరీముల్లా (21) ను అరెస్టు చేశారు పలమనేరు పోలీసులు. ఏదో చేద్దామని ఇలా అడ్డంగా బుక్కయ్యాడా యువకుడు. అందుకే అతిసర్వత్ర వర్జయేత్ అంటారు. ఓవరాక్షన్ మనకు చేటు తెస్తుందని అంతా గ్రహించాలి. సోషల్ మీడియాలో ఈ ఫ్రాంక్ వీడియో వైరల్ అవుతోంది. ఈమధ్యే హైదరాబాద్ లో ఓ హీరో ఫ్రాంక్ వీడియో తీసి కరాటే కల్యాణి చేతిలో చావుదెబ్బలు తిన్న సంగతి తెలిసిందే.
Gorantla Rajendraprasad : నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్ కన్నుమూత