మళ్ళీ లిక్కర్ బాబులు తెగ ఫీలయిపోయారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 3,547.8 లీటర్ల మద్యం ధ్వంసం చేశారు అధికారులు. జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ పర్యవేక్షణలో గంట్యాడ గ్రామం లేఅవుట్ లో అక్రమ మద్యం ధ్వంసం చేశారు సిబ్బంది. ఒకటి కంటే ఎక్కువ కేసుల్లో నిందితులుగా ఉంటే హిస్టరీ షీటు తెరుస్తామని హెచ్చరించిన జిల్లా ఎస్పీ. అక్రమ మద్యం కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరిపై పిడి యాక్ట్ నమోదు చేసేందుకు వెనుకాడమన్నారు. నాటుసారా, మద్యం అక్రమ రవాణపై సమాచారాన్ని డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు అందించాలని కోరారు జిల్లా ఎస్పీ.
వివిధ పోలీసు స్టేషన్లలో 2019 నుంచి 2021 సంవత్సరం వరకు నమోదైన 928 ఎక్సైజ్ కేసుల్లో సీజ్ చేశామన్నారు. 3,547.8 లీటర్ల మద్యంను ధ్వంసం చేసామని జిల్లా ఎస్పీ ఎం. దీపిక వెల్లడించారు. 928 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 17,815 మద్యం బాటిల్స్ లోగల 3,547.8 లీటర్ల మద్యంను ధ్వంసం చేసామన్నారు. నాటుసారా, మద్యం అక్రమ రవాణ, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిరంతరం దాడులు నిర్వహించి, మద్యం, నాటుసారా అక్రమ రవాణ, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఒక్కటి కంటే ఎక్కువ కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై నిరంతర పర్యవేక్షణ ఉండేందుకుగాను, హిస్టరీ షీట్లును తెరుస్తున్నామన్నారు.
Narsapur Congress: అప్పట్లో ఆ నియోజకవర్గం హస్తానికి కంచుకోట.. ఇప్పుడు సీన్ రివర్స్
అదే విధంగా నాటుసారా తయారీదారులకు నల్ల బెల్లం విక్రయించే వ్యాపారులపై కూడా నిఘా పెట్టామన్నారు.నల్ల బెల్లంను నాటు సారా తయారీకి విక్రయించే వ్యాపారులను గుర్తించి, కేసుల్లో నిందితులుగా చేరుస్తున్నామన్నారు. నాటుసారా, మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతూ ఎక్కువ కేసుల్లో నిందితులుగా పట్టుబడిని ఇద్దరిని గుర్తించి, వారిపై పి.డి.యాక్ట్ (ప్రివెన్షన్ డిటెక్షన్ చట్టం) నమోదు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసామన్నారు. జిల్లాలో బెల్టు షాపులు లేకుండా, నాటుసారాను పూర్తిగా నియంత్రించేందుకు ఇప్పటికే 928 కేసుల్లో 1200మందికి పైగా నిందితులను అరెస్టు చేసామని జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు.