AP Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో ఈరోజు తెల్లవారుజామున నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. నెల్లూరు.. కోవూరు.. అల్లూరు.. వాకాడు..కోట. ముత్తుకూరు మండలాల్లో కొనసాగుతోంది. తీర ప్రాంతంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో.. బీచ్ ల వద్దకు ప్రజలు వెళ్ళవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరిస్తోంది.
Farmers Festival: నేడు పాలమూరులో రైతు పండగ ముగింపు సభ.. సీఎం శుభవార్త చెబుతారా..
పెంగల్ తుఫాన్ ఉత్తరాంధ్ర రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తుఫాను తీరాన్ని సమీపిస్తుండగా వర్షాలు ఉధృతి క్రమేపీ పెరుగు తోంది. వచ్చే మూడు రోజులు విస్తారంగా వానలు కురుస్తాయని ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది. దీంతో కోత కోసి పొలంలో ఉన్న వున్న వరి పంట దెబ్బతింటుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అమావాస్య రోజు వచ్చే తుఫాన్ ల వల్ల ఎక్కువ నష్టం ఉంటుందన్న భయం కూడా కనిపిస్తోంది. దీంతో పంటలను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కుప్పలు వేసిన పంటలు కాపాడుకోవడానికి తార్ఫాలిన్లు కప్పి సంరక్షిస్తున్నారు. పండిన పంట కూడా గాలుల ఉధృతికి నేల వాలే ప్రమాదం ఉంది. దీంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో రైతుల్లో కలవర పడుతున్నారు.
ఊహించిన విధంగా వచ్చి పడుతున్న తుఫాను ప్రభావంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా వరి రైతులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 5 లక్షల ఎకరాల్లో వరి పంట పండింది. ఇందులో కేవలం 30 శాతం మాత్రమే కోతలు పూర్తయి ధాన్యం బస్తాలు మిల్లులకు చేరాయి. వరి కోతలు పూర్తి చేయాల్సి ఉన్న రైతులను తుఫాను భయం వెంటాడుతోంది. వర్షం కురిసినా, గాలుల తీవ్రత పెరిగిన వరిచేలకు నష్టం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. మరో రెండు రోజులపాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో రైతులు హడావిడిగా కోతలు పూర్తి చేస్తూ ధాన్యాన్ని మిల్లులకు తరలించే ఏర్పాటు చేస్తున్నారు.
CM Chandrababu : నేడు అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన