Cyclone Alert for AP: ఆంధ్రప్రదేశ్‌కి తీవ్ర తుఫాన్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.. ఐఎండీ సూచనల ప్రకారం తీవ్రవాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ ప్రస్తుతానికి ట్రింకోమలీకి తూర్పుగా 1100 కిమీ, నాగపట్నానికి ఆగ్నేయంగా 350 కి.మీ, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 450 కి.మీ మరియు చెన్నైకి ఆగ్నేయంగా 530 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.. ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ బుధవారం రాత్రికి తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ తదుపరి 2 రోజులలో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపు వెళ్ళేందుకు అవకాశం ఉందని.. దీని ప్రభావంతో గురు, శుక్ర, శనివారాల్లో అంటే ఈ నెల 28, 29, 30 తేదీల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఈ 3 రోజులు మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు..
Read Also: UP: వివాహ వేడుకలో నిర్లక్ష్యం.. టపాసులు పేలి పెళ్లి కారు దగ్ధం.. వీడియో వైరల్
అయితే, ఈ నెల 30వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించింది విపత్తుల నిర్వహణ సంస్థ.. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 55-65 కి.మీ గరిష్టంగా 75 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిచింది.. ఇక, భారీ వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. రైతులు పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని.. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని పేర్కొన్నారు..
Read Also: Jujube benefits: రేగు పండ్లతో ఎన్ని లాభాలో..!
ఇక, రానున్న నాలుగు రోజుల పాటు ఏపీలో వాతావరణ పరిస్థితుల విషయానికి వస్తే.. గురువారం రోజు నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడతాయని.. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. ఇక, శుక్రవారం రోజు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది..
Read Also: Pawan Kalyan Meets PM Modi: ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీ.. మోడీకి డిప్యూటీ సీఎం ప్రత్యేక కృతజ్ఞతలు
మరోవైపు ఈ నెల 30వ తేదీన నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, డిసెంబర్ 1వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు.. అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఓ ప్రకటనలో వెల్లడించారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్..