Vangalapudi Anitha: ఇటీవల విశాఖ పర్యటనలో సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని.. విశాఖ నుంచే ఈ నిషేధం ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2027 నాటికి ఏపీని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చాలన్నదే తమ లక్ష్యమని ప్రకటించారు. అయితే ప్లాస్టిక్ నిషేధంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పందించారు. ఈ ప్లాస్టిక్ బ్యానర్లు, ఫ్లెక్సీలపై నిషేధం కూడా సినిమా…
Minister PeddiReddy Ramachandra Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కుప్పం నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశాడో చెప్పలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. అభివృద్ధి చేసుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో ఎందుకు గెలవలేకపోయారని ప్రశ్నించారు. కోల్లుపల్లెలో వైసీపీ నేతలపై దాడి చేసింది టీడీపీ నేతలేనని.. వైసీపీ జెండాలను కట్టెలతో తొలగించింది టీడీపీ వాళ్లేనని మంత్రి పెద్దిరెడ్డి మీడియాకు వీడియోలు చూపించారు. 33 ఏళ్ళలో ఎన్నిసార్లు…
Budda Venkanna: కుప్పంలో చంద్రబాబు పర్యటనను వైసీపీ అడ్డుకునే యత్నం నిరసిస్తూ విజయవాడలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. వైసీపీ అజెండా అమలు చేసే పోలీసుల్ని చొక్కాలు ఊడతీసి కొడతామని హెచ్చరించారు. చంద్రబాబు కుటుంబాన్ని అంతమొందించే లక్ష్యంతో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులందరూ వైసీపీ యూనిఫామ్…
Minister Roja: రాజమండ్రిలో శుక్రవారం నాడు పర్యాటక శాఖ మంత్రి రోజా పర్యటించారు. వీఎల్ పురంలో మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలిసిప్పటి నుంచి చంద్రబాబులో వణుకు మొదలైందని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. మరోవైపు బాలకృష్ణ ఉచిత ఆరోగ్య రథం ప్రారంభించి ఆ రథంపై కేవలం ఎన్టీఆర్, బాలకృష్ణ ఫోటోలనే ముద్రించుకున్నారని.. చంద్రబాబు ఫోటో…
Lakshmi Parvathi: తెలుగు, సంస్కృతి అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడంపై ఆమె స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని లక్ష్మీపార్వతి ఆకాంక్షించారు. అంతేకాకుండా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తెలుగు దేశం పార్టీని స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అదే తన కోరిక అని చెప్పారు. చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరించి మహానేత ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి టీడీపీని…
Vellampalli Srinivas: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. సంక్షేమ పాలన అందిస్తున్న జగన్ ప్రభుత్వంపై అక్కసుతో పవన్ కళ్యాణ్ కావాలనే అక్కసు వెళ్లగక్కుతున్నాడని ఆరోపించారు. ఆనాడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో అసలైన కోవర్టు పవన్ కళ్యాణేనని విమర్శించారు. చిరంజీవి 18 ఎమ్మెల్యే స్థానాలకు పరిమితం కాగానే బయటకు వెళ్ళిపోయిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. యువరాజ్యం అధినేతగా పవన్ కళ్యాణ్ నిలబడ్డాడా.. ఆ…
Devineni Uma: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీకి సీఎం జగన్ ఇచ్చిన వినతి పత్రాన్ని మీడియాకు ఇవ్వలేని దౌర్భాగ్య, నిస్సహాయ స్థితిలో జగన్ ఉండడం సిగ్గుచేటు అని ఆరోపించారు. 22 మంది ఎంపీలు, 9 మంది రాజ్యసభ సభ్యులు ఉండి కూడా విభజన హామీలను వైసీపీ నేతలు సాధించలేకపోతున్నారని దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. పోలవరం నిర్వాసితులను ఆదుకునేవారే కరవయ్యారని.. పోలవరం…
తాడికొండ నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని, తాడికొండ సమన్వయకర్తగా తనను పార్టీ అధిష్టానం నియమించిందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ గుంటూరులో ఎన్టీవీతో మాట్లాడిన ఆయన తాడికొండ నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులపై స్పందించారు. తాడికొండ సమన్వయకర్తగా తనను పార్టీ అధిష్టానం నియమించిందని తెలిపారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాయకత్వంలో అందరినీ కలుపుకుని పార్టీ పటిష్టానికి కృషి చేస్తానని అన్నాడు. రెండు రోజుల్లో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కలుస్తాఅని, ఎమ్మెల్యే శ్రీదేవి బాగా తెలిసిన వ్యక్తిఅని పేర్కొన్నారు. రెండు మూడు…
Chandrababu: గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో పలువురు వైసీపీ నేతలు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా తెనాలికి చెందిన వైసీపీ నేత గుదిబండ గోవర్ధన్రెడ్డి తన అనుచరులతో పాటు టీడీపీలో చేరారు. దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి సోదరుడి కుమారుడే గోవర్ధన్ రెడ్డి. పదేళ్ల పాటు వైసీపీలో కొనసాగిన ఆయన తాజాగా టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. జగన్ మళ్లీ సీఎం…