Gudivada Amarnath: ఏపీ రాజధానిపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. వికేంద్రీకరణ విధానానికి బలం చేకూర్చే విధంగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. రాష్ట్రానికి ఉన్న రాజ్యాంగపరమైన హక్కులను గుర్తు చేయడం కోసమే సుప్రీంకోర్టుకు వెళ్లామన్నారు. మూడు రాజధానులకు న్యాయపరమైన అనుతులు పొందే దిశగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం తొలి అడుగు అన్నారు.…
Gudivada Amarnath: ఏపీ రాజధానిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అకడమిక్ సంవత్సరం నుంచే విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. త్వరలో అసెంబ్లీలో ఈ అంశంపై బిల్లు కూడా పెడతామని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. తమకు సవాళ్లు విసరడం దేనికి అని.. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తానని చంద్రబాబు చెప్పగానే…
Ambati Rambabu: అమరావతిపై మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. అమరావతి అనేదే పెద్ద కుంభకోణం అని అభివర్ణించారు. గతంలో సీఎస్‌గా పనిచేసి రిటైర్ అయిన ఐవీఆర్ కృష్ణారావు రాసిన ‘ఎవరిది ఈ రాజధాని’ అనే పుస్తకంలో ఏం రాశారో అందరూ తెలుసుకోవాలన్నారు. ఆయన బీజేపీలో ఉన్నారని.. కానీ ఆ పుస్తకాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారని మంత్రి అంబటి రాంబాబు గుర్తుచేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్పారో కూడా ఒకసారి గుర్తుచేసుకోవాలని…
AP Assembly: గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే తొలిరోజే మూడు రాజధానులపై స్వల్పకాలికంగా చర్చించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే ఎన్నికలకు మూడు రాజధానుల రెఫరెండం అంశంతోనే వెళ్లాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రేపటి అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల ఆవశ్యకతపై సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తారని తెలుస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యాన్ని ప్రజల్లోకి సమగ్రంగా తీసుకుని వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు అమరావతి…
Srikanth Reddy: మూడు రాజధానుల అంశంలో టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరిని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తప్పుబట్టారు. అమరావతి రైతుల పాదయాత్రను తాను తప్పుపట్టడం లేదని.. పాదయాత్రలో మాట్లాడిన వాళ్ల మాటలు రాయలసీమ వాసిగా తనకు బాధ కలిగించాయని తెలిపారు. మూడు రాజధానులు చేస్తే రాయలసీమకు చుక్క నీరు ఇవ్వమని అంటున్నారని.. మూడు రాజధానులు అమలు చేస్తే మధ్య ఆంధ్ర ప్రదేశ్ కోసం ఉద్యమం చేస్తామంటున్నారని.. ఈ వ్యాఖ్యల వెనుక చంద్రబాబు ఉన్నారని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు.…
ఉత్తరాంధ్రలో పాదయాత్ర ద్వారా అక్కడ అశాంతిని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఆరోపించారు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు.
Meruga Nagarjuna: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు మతిభ్రమించిందని.. ఆయనకు జబ్బుతో పాటు వయసు కూడా సహకరించడం లేదని ఎద్దేవా చేశారు. లోకేష్ తమపై అసభ్యపదజాలంతో దూషించడాన్ని ఖండిస్తున్నామన్నారు. లోకేష్‌కు 40 ఏళ్లు కూడా ఉండవని.. ఆయనకు తాము కొడుకులం ఎలా అవుతామని మేరుగ నాగార్జున ప్రశ్నించారు. లోకేష్ ఒక లుచ్చా అని.. ఆవు చేలో మేస్తే.. దూడ కూడా చేలోనే మేస్తుందని.. చంద్రబాబు గడ్డి తింటున్నారు కాబట్టి…