Gorantla Madhav: తన వీడియో ఫేక్ వీడియో అని ముందే చెప్పానని.. ఇప్పుడు అదే నిజమని తేలిందని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యానించారు. ఫేక్ ఫోరెన్సిక్ రిపోర్టుతో మరోసారి టీడీపీ దొరికిపోయిందని.. అమెరికా నుంచి ఓ ఫేక్ రిపోర్ట్ తెప్పించారని.. ఈ రిపోర్టుతో చంద్రబాబు నానా యాగీ చేశారని ఆరోపించారు. సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ అక్కడి నుంచి తెప్పించిన వివరాలతో టీడీపీ పరిస్థితి కుడితిలో పడిన బల్లి లాగా తయారైందన్నారు. ఓటుకు నోటు కేసులో…
Perni Nani Fires on Chandrababu: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని విరుచుకుపడ్డారు. రాజకీయాల కోసం ఎంత నీచానికైనా ఒడిగట్టే వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. ఆయన రాజకీయాలు మొదలు పెట్టినప్పటి నుంచి అబద్ధాలే మాట్లాడతాడని ఎద్దేవా చేశారు. అశ్లీల చిత్రాలను సృష్టించడం, ప్రచారం చేయడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. గోరంట్ల మాధవ్ వీడియోపై ఇదిగో సర్టిఫికేట్ తెచ్చాం…అమెరికా ఇచ్చింది అంటూ టీడీపీ నేతలు మాట్లాడారని.. అదేమన్నా అమెరికా FBI…
Kodali Nani: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. లక్ష కోట్లు అవినీతికి పాల్పడ్డాడని జగన్‌పై చంద్రబాబు ఎంత ప్రచారం చేసినా ప్రజలు నమ్మకుండా అధికారాన్ని కట్టబెట్టారని.. ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే పప్పు నాయుడు చంద్రబాబు అని కొడాలి నాని ఆరోపించారు. అటు పప్పు నాయుడు కుమారుడు తుప్పు నాయుడు మంగళవారం మాటలు మాట్లాడుతున్నాడని.. వారంలో ఏదో జగన్ వ్యవహారం బయటపెడతానని వాగుతున్నాడని.. అదేదో మొన్న…
Nara Lokesh: విజయవాడలో చిరు వ్యాపారులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ సీఎం అయిన దగ్గర నుంచి చిరు వ్యాపారులను కూడా వదలకుండా దోచుకుంటున్నారని ఆరోపించారు. కరోనాను ఎదుర్కొన్నాం కానీ.. జగన్ వైరస్‌ను ఎదుర్కోలేకపోతున్నామని లోకేష్ చురకలు అంటించారు. ఏపీలో జగన్, అతని చుట్టుపక్కల ఉన్న నలుగురిదే రాజ్యం…
Minister Venugopala Krishna: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశిస్తూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శలు చేశారు. రాష్ట్రంలో దురదృష్టకరమైన అనైతిక కలయికలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, పరిపాలన పట్ల చంద్రబాబు మాట్లాడలేడు అని.. ప్రజల దృష్టిని మరల్చడానికి వైసీపీ నేతలను దుర్మార్గులుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుట్రలకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నిదర్శనమని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. వైసీపీ నేతలపై బురద జల్లి లబ్ధి పొందాలని…
Gudivada Amarnath: అనకాపల్లిలో మంత్రి గుడివాడ అమర్నాథ్ సోమవారం నాడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. అసలు సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ నుండి జనసేన పార్టీకి స్వతంత్రం వచ్చిందా అని పవన్ కళ్యాణ్‌ను ఆయన సూటిగా ప్రశ్నించారు. 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో తెలుగుదేశం పార్టీ నుంచి స్వతంత్రం కోసం జనసైనికులు…
Gorantla Madhav Challenge to Tdp Leaders: తన వీడియో వ్యవహారం తర్వాత వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తొలిసారిగా అనంతపురం వస్తున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద కురువ సంఘం ఆధ్వర్యంలో ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం బళ్ళారి చౌరస్తా వద్ద ఆలయంలో గోరంట్ల మాధవ్ ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత అనంతపురం బయలుదేరి వెళ్తుండగా ఆయన మాట్లాడుతూ.. తన వీడియో ఒరిజినల్ అని అమెరికాలోని ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక…
Vangalapudi Anitha: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో రిపోర్టుపై టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత తనదైన శైలిలో సెటైర్లు వేశారు. అనుకున్నట్లే జరిగిందని.. తప్పును కప్పిపుచ్చడానికి చేయాల్సినవన్నీ చేస్తున్నారని వంగలపూడి అనిత ఆరోపించారు. డర్టీ ఎంపీ మాధవ్‌కు సచ్చీలుడు అన్న సర్టిఫికెట్ ఇస్తున్నారని మండిపడ్డారు. దీన్ని సమర్థిస్తున్నారా లేదా అనేది సీఎంగా, ఆ పార్టీ అధ్యక్షుడిగా జగన్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీ మాధవ్‌పై చర్యలు తీసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర మహిళల…