KVP: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, దివంగత సీఎం వైఎస్ఆర్ ప్రాణమిత్రుడు కేవీపీ రామచంద్రరావు ‘పోలవరం-ఓ సాహసి ప్రయాణం’ పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సదరు పుస్తకంలో కేవీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి జీవనాడిగా మారిన పోలవరం ప్రాజెక్టుకు ఎదురైన అడ్డంకుల గురించి అందులో కూలంకుషంగా చర్చించారు. డెల్టా ప్రాంతాలకు, రాయలసీమలో దుర్భిక్ష పరిస్థితులకు నీటిలభ్యత లేకపోవడమే కారణమని ఆనాడు వైఎస్ఆర్ ఆలోచించారని.. అందుకే ఏపీలో సాగు నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం…
Pawan Kalyan: కడప జిల్లా చాపాడు మండలం చియ్యపాడులో ముగ్గురు రైతులు విద్యుత్ షాక్తో మరణించడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విద్యుత్ షాక్తో రైతులు దుర్మరణం చెందడం దురదృష్టకరమన్నారు. పంటను కాపాడుకునేందుకు పురుగుల మందు పిచికారీ చేయడానికి వెళ్లిన ముగ్గురు రైతులు విద్యుత్…
Pothula Sunitha: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో హంతకుడు, దగాకోరు, వెన్నుపోటు దారుడు చంద్రబాబు అని అందరికీ తెలుసన్నారు. రెండు ఎకరాల నుంచి ఇంత ఆస్తిని చంద్రబాబు ఎలా సంపాదించారని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు సంగతి తెలిసే ఆయన నీచ చరిత్రకు ప్రజలు చరమగీతం పాడారని ఆరోపించారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన నడుస్తుంటే టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సామాజిక విప్లవకారుడిలా జగన్ సామాజిక…
Andhra Pradesh: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వర్గపోరు రోజురోజుకు పెరిగిపోతోంది. మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజవర్గంలో ఇటీవల వైసీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. దీంతో నగరి నియోజకవర్గ అసమ్మతి వ్యవహారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరింది. ఈ సందర్భంగా తన నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పరిణామాలపై సీఎం జగన్కు మంత్రి రోజా ఫిర్యాదు చేశారు. చక్రపాణిరెడ్డి వర్గం నియోజకవర్గంలో తనను బలహీనపరుస్తోందని ఆమె ఆరోపించారు. ఈ అంశంపై ఇప్పటికే మంత్రి…
Vidadala Rajini: ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి 2023 నాటికి ఉద్దానంలో కిడ్నీ ఆస్పత్రిని ప్రారంభించబోతున్నట్లు ఆమె వెల్లడించారు. రూ. 700 కోట్లతో ఉద్దానంలో ఏర్పాటు చేస్తోన్న రక్షిత మంచినీటి పథకం 80 శాతం పూర్తయిందని.. రక్షిత మంచి నీటి పథకాన్ని వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభిస్తామని ఆమె తెలిపారు. ఉద్ధానం కోసం చంద్రబాబు ఏం చేశారో చెప్పగలరా అని మంత్రి విడదల రజినీ ప్రశ్నించారు. బీసీల ద్రోహి…
CM Jagan: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్తో ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ సమావేశం అయ్యారు. అమరావతి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో ఆయన్ను వర్మ కలిశారు. ఈ సందర్భంగా దర్శకుడు వర్మకు సీఎం జగన్ లంచ్ ఆతిథ్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 40 నిమిషాల పాటు జగన్, రామ్గోపాల్ వర్మ సమావేశం సాగింది. అనంతరం జగన్ నివాసం నుంచి వర్మ బయటకు వచ్చారు. అయితే జగన్తో దర్శకుడు రామ్గోపాల్ వర్మ సమావేశం కావడం ఇప్పుడు రాజకీయ,…
Tammineni Sitaram: అమరావతి రైతుల పాదయాత్రపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అది రైతుల యాత్ర కాదని.. బినామీ యాత్ర అని వర్ణించారు. పాదయాత్ర చేసేది రైతులు కాదని తాము తొలిరోజు నుంచి చెప్తున్నామని.. ముసుగువీరులు ఎవరో శాసనసభలోనే చెప్పామని తమ్మినేని సీతారాం గుర్తుచేశారు. 28వేల మంది వద్ద బలవంతంగా భూములు లాక్కొంటే పాదయాత్రకు ఎంత మంది వచ్చారో అందరూ చూశారన్నారు. ఐడెంటెటీ కార్డులు కేవలం 70…
Dharmana Krishna Das: శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట వైసీపీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సారవకోట మండలం చీడిపూడి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా జగన్ మరోసారి సీఎం అవుతారంటూ జోస్యం చెప్పారు. అలా జరగని పక్షంలో తాను ఎమ్మెల్యేగా గెలిచినా రాజీనామా చేస్తానని ధర్మాన కృష్ణదాస్ ప్రకటించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎవరితో…
Andhra Pradesh: అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోకి అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రవేశించింది. అయితే పసలపూడి గ్రామానికి చేరుకోగానే అమరావతి రైతులకు నిరసన సెగ తగిలింది. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు అమరావతి రైతుల యాత్రకు అడ్డుతగిలారు. అటు పోలీసులు కూడా అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకున్నారు. హైకోర్టు కేవలం 600 మందికే అనుమతి ఇచ్చిందని తెలిపారు. దీంతో పోలీసులతో అమరావతి రైతులు వాగ్వాదానికి దిగారు. ఐడీ కార్డులు చూపించిన వారిని…