YSRCP : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలపై అదనపు భారాన్ని మోపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. విద్యుత్ ఛార్జీల పెంపుతో సామాన్యులపై భారాన్ని పెంచిన ప్రభుత్వ నిర్ణయం దారుణమని ఆ పార్టీ నేతలు విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపు కారణంగా ప్రజలపై రూ. 15,000 కోట్ల అదనపు భారం పడిందని వైసీపీ ఆరోపించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాష్ట్ర…
ఢిల్లీలోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార నివాసానికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ విచ్చేశారు. సీఎం చంద్రబాబుతో రైల్వే మంత్రి భేటీ అయ్యారు. ఏపీలోని పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసానికి సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు.
విజన్-2047 పేరిట చంద్రబాబు మరో మారు పబ్లిసిటీ స్టంట్‌కు దిగారని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టడానికి, మాయచేడానికి ఇదొక ఎత్తుగడ మాత్రమేనన్నారు. చంద్రబాబు పత్రంలో రాష్ట్రం అవసరాలకు, ప్రజల అవసరాలకు చోటేలేదు, వాస్తవిక దృక్పథం అంతకన్నా లేదన్నారు.
సాగునీటి సంఘాల ఎన్నికలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. సాగునీటి సంఘాల ఎన్నికలపై కేంద్రపార్టీ కార్యాలయం నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రీజనల్ కోఆర్డినేటర్స్, జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్దంగా సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
ఉపమఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకి ఓ నెంబర్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో హోంమంత్రి అనితకు ఇదే నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు నిర్ధారణ అయింది.
వైసీపీ ప్రభుత్వంలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి కబ్జాలకు పాల్పడ్డారని మంత్రి నారాయణ తీవ్రంగా విమర్శించారు. సెంటు భూమి నుంచి వేల ఎకరాల వరకూ వైసీపీ ప్రభుత్వంలో కబ్జా జరిగిందన్నారు. పరిశ్రమలు, పోర్టులను సైతం కబ్జా చేశారని ఆరోపించారు. గత అరాచక ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, నాయకులు దోపిడీ చేశారని ఆయన విమర్శలు గుప్పించారు.
మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయ్యింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కీలకంగా వ్యవహరించిన ఆళ్ల నాని మూడు నెలల క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అప్పటినుంచి ఎవరికీ అందుబాటులో లేని ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, అదానీ సోలార్ ప్రాజెక్టు అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పరిశీలిస్తున్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. పవన్, ఢిల్లీ పర్యటనలో భాగంగా, ఉప రాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం, కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌తో భేటీ అయిన పవన్, మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలపై ధ్వజమెత్తారు. Adani Group: అమెరికాలో…
YS Jagan : ఏపీ సీఎం చంద్రబాబు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు చదువులు మానేసుకుంటున్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థులపై కక్షగట్టినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎక్స్ వేదికగా.. ‘@ncbn గారి కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను పిల్లల చదువులకు చెల్లించకపోవడంతో చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. చంద్రబాబుగారు వారిపై కక్షకట్టినట్టు…
సూపర్-6 హామీల విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు అబద్ధాలు కొనసాగుతూ వస్తున్నాయన్నారు.సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ఉండటానికి మాత్రమే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.