రాష్ట్రంలో టీడీపీ, జనసేనలు బీజేపీతో జతకట్టడం సరికాదని సీపీఎం నేత బీవీ రాఘవులు పేర్కొన్నారు. బీజేపీది ధృతరాష్ట్ర కౌగిలి అని.. వాళ్లతో చేరినవాళ్లు దెబ్బతింటారని ఆయన అన్నారు. ఆంధ్రాలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్లు ఇదే విధంగా దెబ్బతిన్నాయన్నారు. ఇప్పుడైనా టీడీపీ, జనసేన పార్టీలు మేలుకోవాలన్నారు.
ఏపీ రాజకీయాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ అధికారం ఉందని.. ప్రతిపక్షం లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ అంటూ పేర్కొన్నారు. ఏపీలో ఉంది కేవలం అధికార పక్షమేనని.. ఏపీలో అందరూ బీజేపీ పక్షమేనన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ కార్యాలయంలో టీడీపీ పార్లమెంటరీ భేటీ జరుగుతోంది. ఈ భేటీకి తెలుగుదేశం ఎంపీలు, సీనియర్ నేతలు హాజరయ్యారు. తొలి పార్లమెంటరీ పార్టీ భేటీ కావటంతో సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూలు విడుదలైంది. ఈ నెల 25 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. నామినేషన్ల దాఖలుకు జూలై 2 తేదీన తుది గడువుని పేర్కొంది.
రాష్ట్రానికి మంత్రి అయినా అనంతపురం జిల్లాకు కూలీగా పని చేస్తానని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారిగా జిల్లాకు వస్తున్న పయ్యావుల కేశవ్కు సోమవారం మండలంలోని బాట సుంకులమ్మ ఆలయ సమీపంలో ఘన స్వాగతం లభించింది.
నామినేటెడ్ పదవుల భర్తీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి నామినేటెడ్ పదవులిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా జాప్యం చేయకుండా నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని ఆయన భావిస్తున్నారు.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారంతో పల్నాడుతో టెన్షన్ కొనసాగుతోంది. నరసరావు పేటలో పిన్నెల్లి ఉంటున్న గృహం చుట్టూ పోలీసులు మోహరించారు. కోర్టు ఆదేశాల ప్రకారం సంతకం చేసేందుకు కొద్దిసేపటి క్రితం ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మరోవైపు పిన్నెల్లి బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరగనుంది.
చంద్రబాబు మారరు అనే అపవాదు తనపై ఉందని... కానీ మీరు మారిన చంద్రబాబును చూస్తారని.. ఇక అలా ఉండదని.. మీరే ప్రత్యక్షంగా చూస్తారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పార్టీ ఎంపీలతో జరిగిన భేటీలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ఫలితాల్లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. కూటమికి భారీ ఎత్తున సీట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం చతికల పడింది. దీంతో ఈ రోజు ముఖ్యమంత్రి పదవికి ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజీనామా చేశారు.
ఐదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి 2029 మే 30న వేలాది మంది అభిమానుల హర్షధ్వానాల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు. మే 30న సరిగ్గా మధ్యాహ్నం 12.23 గంటలకు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.