Vidadala Rajini: గుంటూరు జిల్లా రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. మాజీ మంత్రి విడదల రజిని తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో తనపై అక్రమ కేసులు పెట్టించారని, నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలే ఈ కుట్రకు దర్శకుడని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన వ్యాపార లావాదేవీలకు సహకరించమని తనపై ఒత్తిడి తెచ్చారని, అంగీకరించకపోవడంతో తప్పుడు కేసులు పెట్టించారని విమర్శించారు. అంతేకాకుండా.. నా మీద అక్రమ కేసులు పెట్టించి, రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె వాపోయారు.…
జనసేన పార్టీ 11ఏళ్లు పూర్తి చేసుకుని 12 ఏట అడుగు పెట్టింది. నేడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా నేడు కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాడలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించారు. జనసేన 12 ఏళ్ల పండుగ వైభవంగా సాగుతోంది.. ఈ సభకు పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరై కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేస్తారు. సభలో 90 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు..
మేము కూటమిగా కలిసే ఉంటాం.. విడిపోయే ప్రసక్తే లేదు.. ఎందుకు పవన్ ఈ మాట పదే పదే చెబుతున్నారు. దీని వెనక ఉద్దేశం ఏంటి..? కొన్ని అంశాల్లో వచ్చిన విభేదాల వల్ల ఈ మాట చెబుతున్నారా.. లేక వైసీపీ బలపడకూడదు అనే ఉద్దేశం ఉందా..? కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతోంది. కూటమి ఏర్పాటులో పవన్ పాత్ర చాలా కీలకం.
Kesineni Nani: నందిగామలో మాజీ ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను రాజకీయాల నుంచి తప్పుకున్నా ప్రజా సేవలో ఎప్పడు ఉంటాను.. నాకు విజయవాడ అంటే మమకారం పిచ్చి.. విజయవాడ నాకు రెండు సార్లు ఎంపీగా పని చేసే అవకాశం కల్పించింది అని పేర్కొన్నారు.
Tirupati: తిరుపతి నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్ ఎన్నిక నేడు (ఫిబ్రవరి 3) ఉదయం 11 గంటలకు ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో జరగనుంది. భూమన అభినయ రెడ్డి రాజీనామాతో ఖాళీగా మారిన ఈ పదవికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) తన పట్టును నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, ప్రతిపక్ష కూటమి ఈ స్థానంపై కన్నేసింది. ఈ నేపథ్యంలో నగరంలో తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు, క్యాంప్ రాజకీయాలు ముదిరాయి. దీనితో గత మూడు రోజులుగా తిరుపతిలో…
Elections In AP: ఆంధ్రప్రదేశ్లో నేడు (ఫిబ్రవరి 3)న 10 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకునేందుకు ఉత్కంఠభరితంగా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అధికార పార్టీ సీట్లను కాపాడుకోవాలని, వైసీపీ వీటిని గెలుచుకోవాలని వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్నాయి. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. Also Read: Municipal Chairperson: నేడు హిందూపురంలో 144 సెక్షన్.. తిరుపతి…
విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు చేసిన ప్రకటనపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వస్తోందని తెలిపారు.
ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. వచ్చే నెల (ఫిబ్రవరి 6) న ఈ భేటీ జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో వచ్చే బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు. త్వరలో ప్రారంభించే సంక్షేమ పథకాలపై కూడా కేబినెట్లో చర్చ జరగనుంది.
వైసీపీ మరో షాక్ తగిలినట్టు అయ్యింది.. మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైసీపీకి రాజీనామా చేశారు.. అంటే, ఆయన కేవలం వైసీపీకి మాత్రమే కాదు.. మొత్తం రాజకీయాలకే గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు.. గత ఎన్నికల్లో కర్నూల్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇంతియాజ్.. ఓటమి పాలయ్యారు.. అయితే, ఇప్పుడు ఇంతియాజ్ రాజీనామా లేఖ విడుదల చేశారు.. రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు.. ఇక, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఇంతియాజ్ విడుదల…
Ambati Rambabu : విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ నిరసనలు వ్యక్తం చేసింది. ఏపీ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ. అయితే. ఈ నేపథ్యంలో గుంటూరులో నిర్వహించిన వైసీపీ నిరసన కార్యక్రమంలో మాజీమంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. తమ్ముళ్లు మీరు మాకు ఓటు వేయండి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. తగ్గించడం సంగతి దేవుడు ఎరుగు ,చార్జీల మోత మోగుతుందన్నారు అంబటి రాంబాబు. వైసీపీకి 11…