ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి పునఃనిర్మాణం సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభ జరిగే సమయంలో వర్షం వస్తుందని తాము అనుకున్నట్లు చెప్పారు. మోడీ ఓ మాట చెప్పారని గుర్తు చేశారు. ” ఈ రోజు వర్షం వస్తుందని మేము అనుకున్నాం. కానీ మోడీ వస్తున్నారంటే.. వర్షం కూడా రాకుండా దేవతలు మొత్తం ఆశీర్వదించారంటే అది ఈ అమరావతి పవర్. ఇప్పుడే ప్రధాని నాతో ఓ మాట అన్నారు. నా 25…
అమరావతి రాజధాని పునర్నిర్మాణం చేస్తున్నామంటే ఈరోజు కంటే ప్రత్యేకమైన రోజు మరి ఏది ఉండదలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. గతంలో మోడీని ఎప్పుడు కలిసిన చాలా ఆహ్లాదకరంగా ఉండేవారని.. కానీ మొన్నటి సమావేశంలో అమరావతికి రమ్మని పిలవడానికి వెళ్తే.. తమ భేటీ చాలా గంభీరంగా సాగిందని గుర్తు చేశారు.
రాజధాని నిర్మాణానికి 34000 ఎకరాలు ఇచ్చిన 29 వేల పైచిలుకు రైతులుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నమస్కారాలు తెలిపారు. అమరావతి రైతులు ఐదు సంవత్సరాలుగా నలిగిపోయారని.. రోడ్ల మీదకు వచ్చి, ముల్లకంచెలపై కూర్చొని, పోలీసులు లాఠీ దెబ్బలు తిని, కేసులు పెట్టించుకున్నారని గుర్తు చేశారు. 2000 రైతుల ప్రాణాలు కోల్పోయాయని చెప్పారు. రైతులు నలిగి బాధపడి, తమ కన్నీళ్లు తుడిచేవారు ఉన్నారా? అని చాలామంది మహిళలు రైతులు ఆ రోజుల్లో తను అడిగిన సన్నివేశాన్ని గుర్తు…
ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. పదేళ్ల క్రితం 2015 అక్టోబరు 22న అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగానే అమరావతి పునర్నిర్మాణం మొదలైంది. ఈ కార్యక్రమంలో మంత్రి నారాలోకేష్ మాట్లాడారు. పహల్గాం దాడిలో అమరులైన టూరిస్టుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వేదిక మీద నుంచి పాకిస్థానీయులను హెచ్చరించారు.
అమరావతిలో చంద్రబాబు అసెంబ్లీ ప్రసంగాలు పుస్తకావిష్కరణ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ పుట్టిన రోజు సందర్భంగా అసెంబ్లీ కమిటీ హాల్లో రెండు పుస్తకాలను రఘురామకృష్ణరాజు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆవిష్కరించారు. చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చేసిన ప్రసంగాలకు సంబంధించి, రెండు పుస్తకాలను జయప్రద ఫౌండేషన్ ప్రచురించింది. ఈ కార్యక్రమంలో పుస్తక రూపకర్త టీడీ జనార్ధన్ మాట్లాడారు.
విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ రేగుతోన్న వేళ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్.. అసలు, విశాఖ అభివృద్ధి కోసమే మేయర్ పై అవిశ్వాసం పెట్టినట్టు తెలిపారు.. నాలుగేళ్ల తర్వాత పాలనను సమీక్షించుకునే అవకాశం చట్టం కల్పించింది.. 9 నెలల కోసం రాజకీయ ప్రయోజనాలను ఆశించిన మార్పు కోరుకునే వాళ్లం కాదన్నారు..
డెడ్‌బాడీ డోర్ డెలివరీ కేసుపై కూటమి సర్కార్ స్పెషల్‌గా దృష్టి పెట్టిందా? ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీకి మూడినట్టేనా? ఈ కేసులో ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టేందుకు కూటమి సర్కార్ ప్లాన్ చేస్తోందా? ఇందులో ఎమ్మెల్సీ తప్పును నిరూపించగలిగితే… వైసీపీ స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్‌ని కూడా కదిలించవచ్చని అనుకుంటోందా? ఆ కేసు విషయంలో జరిగిన తాజా డెవలప్మెంట్ ఏంటి? అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని షేక్ చేసిన అంశాల్లో డెడ్‌బాడీ డోర్ డెలివరీ…
మహిళల పట్ల ఎన్డీఏ ప్రభుత్వం గౌరవంతో వ్యవహరిస్తోందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. మహిళల రక్షణకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నదని ఆయన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి భార్యపై కిరణ్ అనే వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నదని మంత్రి పేర్కొన్నారు. కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా వెంటనే అరెస్టు చేయించామని తెలిపారు. ఇలాంటి పైశాచికంగా ఆనందపడే పనులకు ప్రభుత్వంలో చోటు లేదని…
సీఐడీ విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన జోగి రమేష్.. చంద్రబాబు ఇంటికి నిరసన తెలియజేయానికి మాత్రమే వెళ్లాను.. ఈ విషయం చంద్రబాబు, లోకేష్ తెలుసుకోవాలని సూచించారు.. రెడ్ బుక్ శాశ్వతం కాదు.. ఒకటి రెండేళ్లు రెడ్ బుక్ నడిచినా తర్వాత రెడ్ బుక్ మడిచి పెట్టుకోవాల్సిందే అంటూ హాట్ కామెంట్లు చేశారు..
Ambati Rambabu : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల లింగమయ్య హత్య అనంతర పరిణామాలపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ పై “రౌడీ”, “సైకో” అంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్న తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. “వీళ్ళు వీళ్ళ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా?” అంటూ ప్రశ్నించిన అంబటి, చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని, ఆయనకే “చీటర్” బిరుదు…