Ambati Rambabu : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల లింగమయ్య హత్య అనంతర పరిణామాలపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ పై “రౌడీ”, “సైకో” అంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్న తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. “వీళ్ళు వీళ్ళ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా?” అంటూ ప్రశ్నించిన అంబటి, చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని, ఆయనకే “చీటర్” బిరుదు సరిపోతుందని వ్యాఖ్యానించారు.
అంబటి మాట్లాడుతూ, రాష్ట్రంలో హత్యలు, హత్యా యత్నాలు జరుగుతున్నాయని, అయితే పోలీసులు వాటిపై సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. “కొంతమంది పోలీసులకు అసలు పోస్టింగ్‌లు ఇవ్వరు, కోర్టు వెళ్లినా తప్ప కేసులు నమోదు చేయడం లేదు,” అని అన్నారు. అంతేకాదు, ఆయన తానే వ్యక్తిగతంగా కేసుల నమోదు విషయంలో అడిగితే తనపైనే కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
అంబటి తన వ్యాఖ్యలలో డీజీపీపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. “అనుమతి తీసుకుని కలుసుకోవడానికి వెళ్ళినా ఆయన కలవలేదు,” అంటూ వ్యాఖ్యానించారు. పోలీస్ వ్యవస్థ కొంతమందికి మాత్రమే సేవలందిస్తోందని ఆరోపించిన ఆయన, “అలాంటి వారిని బట్టలూడదీసి నిలబెడతాం,” అంటూ హెచ్చరించారు.
ముఖ్యమంత్రి జగన్ ఇటీవల కొన్ని పోలీసు వర్గాలకు హెచ్చరికలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసిన అంబటి, “జగన్ ఒక్క సెక్షన్ పోలీసుల గురించి మాత్రమే అన్నారు. గతంలో చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు ఎలా మాట్లాడారో ప్రజలందరికీ గుర్తుంది,” అని అన్నారు.
Orange Alert: గాలుల వేగం గంటకు 50 కి.మీ.? వర్షాలపై వాతావరణ కేంద్రం కీలక అప్డేట్..!