పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి తిరుగే లేకుండా పోయింది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఉండి, పాలకొల్లు తప్ప అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలో వైసీపీలో వర్గ పోరు తారస్థాయికి చేరింది. సాక్షాత్తు వైసీపీ ఎంపీటీసీ చంపుతానని అదే పార్టీకి చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెదిరిస్తున్నాడంటూ, ప్రాణ రక్షణ కావాలని నేరుగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
Pinnelli Ramakrishna Reddy: మంత్రి పదవి ఆశించా.. రానందుకు బాధలేదు
ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లికి ఎంపీటీసీ బజారయ్యను శ్రీరామనవమి రోజున అదే గ్రామానికి చెందిన శ్రీను, నాగు అనే వ్యక్తులు కత్తులు చేత బట్టి చంపడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎంపీటీసీ బజారయ్య కనిపించకపోవడంతో అతని ఇంటి సమీపంలో ఉన్న అతని స్నేహితుడి స్వీట్ షాపుని ద్వంసం చేశారని ఎంపీటీసీ బజారయ్య నేరుగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
అంతేకాక గతంలో కూడా తనను చంపేందుకు ప్రయత్నించారని, తన రాజకీయ ఎదుగుదల ఓర్వ లేని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజబాబు తనను చంపించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా వైసీపీలోనే రెండు వర్గాలు చంపుకునే స్థాయికి వెళ్లే అక్కడ వర్గపోరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇక్కడ జి కొత్తపల్లిలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు వర్గాలు కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో బజారయ్య వర్గానికి చెందినవారే గెలుపొందడంతో తమ ఆధిపత్యం తగ్గిపోయిందని భావించిన సదరు నేతలు ఎంపీటీసీ బజారయ్యాను అడ్డు తప్పించాలని చూస్తున్నారని, ప్రాణ రక్షణ కల్పించాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు.