సీఎం జగనే నాకు కొండంత అండ.నేను ఒంటరిని కాదు.. నాకు ఏ వర్గమూ లేదు.సీఎం అండ ఉండగా నేను ఎందుకు ఒంటరి అవుతాను..? అన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. రెండు జిల్లాలకు రీజినల్ కో ఆర్డినేటర్ ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ణతలు తెలిపేందుకు వచ్చా.పార్టీని బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు.మేం సీఎం మనషులం.. సీఎం గీత గీస్తే దాటం. నెల్లూరులో కోల్డ్ వార్ అంటూ ఏమీ లేదు.కుటుంబంలో ఎక్కడైనా చిన్నచిన్న విభేధాలు ఉంటాయి.అందరూ కలసి కట్టుగా…
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం. వైసీపీలో వర్గ వివాదాలు.. విభేదాలు.. గ్రూప్ పాలిటిక్స్‌కు నగరి కేరాఫ్ అడ్రస్. ఇక్కడ పంచాయితీలు పలుమార్లు వైసీపీ అధిష్ఠానం వరకు వెళ్లాయి. అయినప్పటికీ రివెంజ్ పాలిటిక్స్ కొదవ లేదు. నగరి నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరసగా వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు ఆర్కే రోజా. సొంత పార్టీలోనే ఆమెకు అసమ్మతి సెగ ఉంది. గత ఎన్నికల సమయంలో ఈ సమస్య మరింత ముదిరి పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల నాటికి తారాస్థాయికి…
నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్, వైసీపీ ఇంఛార్జ్, శాప్ ఛైర్మన్‌గా ఉన్న బైరెడ్డి సిద్దార్థరెడ్డి మధ్య తారాస్థాయిలో విభేదాలు ఉన్న సంగతి బహిరంగ రహస్యమే. ఎన్ని విభేదాలు ఉన్నా ఇద్దరూ పార్టీ కార్యక్రమాలతోపాటు.. ప్రభుత్వ ప్రొగ్రామ్స్‌లో చురుకుగా పాల్గొనేవారు. అయితే నాలుగు నెలలుగా సిద్దార్థరెడ్డి వైఖరిలో మార్పు వచ్చిందని వైసీపీ కేడర్ చెవులు కొరుక్కుంటోందట. ఎందుకలా అనే దానిపై పార్టీ నేతలు ఆరా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో సిద్దార్థరెడ్డి భేటీ…
కేసీఆర్ ఆహ్వానంతో టీఆర్ఎస్లో చేరిక మండవ వెంకటేశ్వరరావు. మాజీ మంత్రి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవ.. నాటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేశారు. నాటి రాజకీయాల్లో మండవ పేరు ప్రముఖంగా వినిపించేది. జిల్లాలో బలమైన నేతగా ఉండేవారు కూడా. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి మారిపోయింది. అప్పటి వరకు టీడీపీలో ఉన్న ఆయన రాజకీయంగా సైలెంట్ అయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల ముందు అనూహ్యంగా టీఆర్ఎస్లో చేరారు మండవ. అప్పట్లో సీఎం కేసీఆర్ స్వయంగా మండవ…
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు చాలామంది కేబినెట్ బెర్త్ ఆశించారు. చివరకు జిల్లాలు.. సామాజికవర్గాల వారీగా ఎమ్మెల్యేలను ఎంపిక చేసి ఛాన్స్ ఇచ్చారు సీఎం జగన్. ఈ క్రమంలో మంత్రివర్గంలో చోటు కోసం జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు చాలా పోటీపడ్డారు. సామాజిక సమీకరణాలను లెక్క చేయకుండా లాబీయింగ్ చేసిపడేశారు కూడా. చివరకు పోటీ పడినవ వారికి కాకుండా.. సైలెంట్‌గా ఉన్నవారికి అవకాశం దక్కింది. చాలా జిల్లాల్లో జరిగింది ఇదే. ఈ జాబితాలో ఉమ్మడి అనంతపురం జిల్లా…
పొలిటికల్ అటెన్షన్ కోసం బీజేపీ ఆపసోపాలు ఏపీలో బలపడేందుకు నానా తంటాలు పడుతోంది బీజేపీ. వచ్చే ఎన్నికల నాటికి బలమైన శక్తిగా మారాలని ఎన్నెన్నో ప్రణాళికలు వేస్తోంది. కానీ.. అవేమీ వర్కవుట్ కావడం లేదు. రెండు మూడు రోజులకే వేడి చల్లారిపోతోంది. తర్వాత వాటి గురించి.. బీజేపీ గురించి ప్రజలు ఆలోచించే పరిస్థితి ఉండటం లేదు. దీంతో ప్రజల్లో పొలిటికల్ అటెన్షన్ తీసుకొచ్చేందుకు ఏం చేయాలో కమలనాథులకు పాలుపోవడం లేదట. ప్లాన్స్ వర్కవుట్ కావడం లేదా? ప్రస్తుతం…
బీజేపీ ప్రజల నుంచి ఒంటరవుతోంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం. మొన్నటి ఐదురాష్ట్రాల ఎన్నికల్లోనూ చావు తప్పి కన్నులొట్టబోయి బయట పడిందన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు. రాబోయే కాలంలో మత పరంగా ప్రజలను విభజించి అధికారంలోకి రావాలని చూస్తోంది. శ్రీరామనవమి, హనుమాన్ జయంతిలను ఘర్షణలకు ఉపయోగించుకుంది. రాబోయే కాలంలో ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది. లౌకిక శక్తులన్నీ కలిసొచ్చి మతోన్మాదానికి వ్యతిరేకంగా కలిసి రావాలన్నారు. బీజేపీ మతోన్మాద శక్తులకు…