Kodali Nani: ఒక్క పేదవాడు అడిగినా, నేను పోటీ చేయను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళిన కొందరు అధికార పార్టీ నేతలకు ఊహించని షాక్ తగిలింది. ప్రజల నుంచి నిరసన సెగ ఎదురైంది. వివిధ అంశాలపై ప్రజలు నేతల్ని నిలదీస్తున్నారు. ఉపాధిహామీ పనుల కూలీలు రాలేదని కొందరు, రోడ్డు వేయించమని మరికొందరు నేతలపై తిరుగుబాటుకి దిగారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కొడాలి నాని వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదంటూ మీడియా ముందుకొచ్చారు.
జగన్ బతికున్నంత కాలం ఆయన సీఎంగానే ఉండాలని, ఆయన కోసం పేదలందరూ ఒకే వేదిక మీదకు రావాలని నాని పిలుపునిచ్చారు. జగన్ సీఎం అయ్యుండకపోతే, పేదలు ఇళ్లు లేక అల్లాడిపోతుండే వారన్నారు. డిసెంబర్ 21న జగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని.. గుడివాడలో టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. తనకు ఇల్లు లేదని ఏ ఒక్క పేదవాడు తనను అడిగినా, 2024 ఎన్నికల్లో పోటీ చేయనని ఛాలెంజ్ చేశారు. గుడివాడ 22వ వార్డులో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో నాని మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
పనీపాట లేకే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్‌లు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని నాని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నింటినీ వైసీపీ ప్రభుత్వం నెరవేర్చిందని, తమ పార్టీకి ప్రజా అనుకూల ఓటు మాత్రమే ఉందని చెప్పారు. తమ 151 సీట్లు తమకు మళ్లీ పక్కాగా వస్తాయని నమ్మకంగా చెప్పిన కొడాలి నాని.. మిగిలిన 24 సీట్ల కోసమే ప్రతిపక్షాలు పోరాడాలని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!