ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి పునఃనిర్మాణం సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభ జరిగే సమయంలో వర్షం వస్తుందని తాము అనుకున్నట్లు చెప్పారు. మోడీ ఓ మాట చెప్పారని గుర్తు చేశారు. ” ఈ రోజు వర్షం వస్తుందని మేము అనుకున్నాం. కానీ మోడీ వస్తున్నారంటే.. వర్షం కూడా రాకుండా దేవతలు మొత్తం ఆశీర్వదించారంటే అది ఈ అమరావతి పవర్. ఇప్పుడే ప్రధాని నాతో ఓ మాట అన్నారు. నా 25 ఏళ్ల చరిత్రలో ఏ మీటింగ్‌కి వచ్చిన వాతావరణం సానుకూలంగానే వచ్చింది. ఏ మీటింగ్ క్యాన్సల్ కాలేదు. ఈ మీటింగ్ కూడా విజయవంతం అవుతుందనే వచ్చినట్లు మోడీ చెప్పినప్పుడు నాకు ఎంతో ఆనందం కలిగింది.
READ MORE: PM Modi: డిప్యూటీ సీఎం పవన్కి ప్రధాని మోడీ గిఫ్ట్.. ఏమిచ్చాడంటే?
ఏపీ కలల రాజధాని అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు.. ఐదు కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, ఆశలు, ఆకాంక్షలకు ఈ నగరమే ప్రతిరూపమన్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా 29 వేల మంది రైతులు ఏకంగా 34వేల ఎకరాల భూమిని రాజధానికి పూలింగ్ కింద ఇచ్చారంటే.. దేశానికే కాదు.. ప్రపంచానికే ఇదో చరిత్ర అన్నారు. అలాంటి అమరావతి నగర నిర్మాణం తలపెడితే.. గత ఐదేళ్లలో ఎలాంటి విధ్వంసం జరిగిందో చూశామన్నారు.
READ MORE: India Pakistan: బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లకు షాక్ ఇచ్చిన భారత్..