అమరావతిలో చంద్రబాబు అసెంబ్లీ ప్రసంగాలు పుస్తకావిష్కరణ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ పుట్టిన రోజు సందర్భంగా అసెంబ్లీ కమిటీ హాల్‌లో రెండు పుస్తకాలను రఘురామకృష్ణరాజు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆవిష్కరించారు. చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చేసిన ప్రసంగాలకు సంబంధించి, రెండు పుస్తకాలను జయప్రద ఫౌండేషన్ ప్రచురించింది. ఈ కార్యక్రమంలో పుస్తక రూపకర్త టీడీ జనార్ధన్ మాట్లాడారు.
READ MORE: Crime: అక్రమ సంబంధం అనుమానంతో భార్య, కుమార్తెలపై యాసిడ్ దాడి..
ఐటీ విప్లవం వచ్చిన వెంటనే తెలుగు జాతికి దీని ఫలాలు అందించాలని భావించిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని పుస్తక రూపకర్త టీడీ జనార్ధన్ అన్నారు. కంప్యూటర్ కూడు పెడుతుందా అని అప్పట్లో తప్పుడు ప్రచారం చేయడంతో ఓ ఎన్నికల్లో కూడా ఆయన ఓడిపోయారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు నాడు చేసిన కృషి వల్ల ప్రతి రైతు, ప్రతికూలీ, ప్రతి కార్మికుడి ఇంట్లో ఓ ఐటీ ఉద్యోగి వచ్చారని వెల్లడించారు. వారు అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ తల్లితండ్రులకు పంపిస్తూ ఇటు రాష్ట్ర సంపదని పెంపొందిస్తున్నారన్నారు. ఇప్పుడా హైదరాబాదు సంపద ఉపాధి కేంద్రంగా మారింది అలాగే అమరావతి కూడా మనకు నిర్మితం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో విద్యుతే లేదు అంధకారమే ఉండేదన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొత్తం 19 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారని.. ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే 15వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించారని కొనియాడారు.
READ MORE: Thomson Smart Tv: క్రేజీ డీల్.. జియోహాట్‌స్టార్ సపోర్ట్‌తో.. రూ.5,999కే స్మార్ట్ టీవీ
“చంద్రబాబు పాలనుకొచ్చే నాటికి కేవలం 5000 మెగావాట్లు మాత్రమే ఉండేది. తరువాత వచ్చిన వారంతా 2000 మెగావాట్లు మాత్రమే అదనంగా చేయగలిగారు. వ్యవసాయం పరిశ్రమలు ఏది అభివృద్ధి చెందాలన్నవిద్యుత్ తప్పనిసరి. నదులు అనుసంధానం గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, చంద్రబాబు మాత్రమే. చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని గాలి ప్రచారం చేశారు. ఆధారం చూపాలని అడిగితే నేటికీ తేలేకపోయారు. అందుకే నిజాలు మనం మాట్లాడకపోతే అబద్ధాలు రాజ్యమేలుతాయి. ప్రచార యుద్ధం ముందు గెలిస్తేనే అసలు యుద్ధం గెలుస్తాం. 95లో ముఖ్యమంత్రిగా ఫైళ్ళ క్లియరెన్స్, క్లీన్ అండ్ గ్రీన్, వంటి అనేక కాన్సెప్ట్లను తీసుకొచ్చారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ప్రసంగాలన్నీ ఒక పుస్తకంలో ప్రచురించాము. ప్రతిపక్ష నేతగా ఉండి బాబ్లీలో పోరాటం చేసి మహారాష్ట్రలో జైలుకు కూడా వెళ్లారు. ఇలాంటివన్నీ పుస్తకంలో రాయకపోతే భావితరాలకు ఎలా తెలుస్తుంది.” అని జనార్ధన్ వెల్లడించారు.