CM Chandrababu: ఐదు కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ అమరావతి.. మూడేళ్లలో పూర్తి చేస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి రాజధాని పునర్నిర్మాణం చేస్తున్నామంటే ఈరోజు కంటే ప్రత్యేకమైన రోజు మరి ఏది ఉండదలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. గతంలో మోడీని ఎప్పుడు కలిసిన చాలా ఆహ్లాదకరంగా ఉండేవారని.. కానీ మొన్నటి సమావేశంలో అమరావతికి రమ్మని పిలవడానికి వెళ్తే.. తమ భేటీ చాలా గంభీరంగా సాగిందని గుర్తు చేశారు. దీనికి ఏకైక కారణం ఉగ్రవాదుల దాడితో నా దేశ ప్రజల ప్రాణాలు కోల్పోయారని మోడీ ఆవేదనను మోడీలో తాను చూసినట్లు సీఎం తెలిపారు. ఉగ్రవాదులను అంతం చేయడానికి కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయంలో తాము ప్రధానికి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు మోడీకి అండగా ఉన్నారన్నారు.
Also Read
- SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. 'మిస్టర్ 360' అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అప్పుడు ప్రధాని మోడీని మళ్లీ ఆహ్వానిస్తామని చెప్పారు.. “రూ.57,980 కోట్ల ప్రాజెక్టులకు ఇవాళ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి.. మోడీ గైడెన్స్‌తో అమరావతిని ప్రపంచం మెచ్చే రాజధానిగా తయారు చేస్తాం.. అమరావతి 5 కోట్ల మంది ప్రజల సెంటిమెంట్.. 5 లక్షల మంది అమరావతిలో చదువుకునే అవకాశం ఉంటుంది.. అమరావతిని హెల్త్, ఎడ్యుకేషనల్ హబ్‌గా చేస్తాం.. అమరావతిని పర్యావరణహితంగా తయారు చేస్తాం.. బిట్స్ పిలానీ, టాటా ఇన్నోవేషన్ హాబ్ లాంటి సంస్థలు ఇక్కడికి వస్తాయి.” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
READ MORE: Deputy CM Pawan Kalyan: ఆ బాధను నేను మర్చిపోలేను..
“కేంద్రం తీసుకున్న కులగణన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. 2024 ఎన్నికల్లో నేను, పవన్ కళ్యాణ్ కలిసి పని చేసి 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించాం.. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన ఆసరాతో ఏపీ అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది.. కేంద్రం సహకారంతో అమరావతిని మళ్లీ పట్టాలెక్కిస్తున్నాం.. 34 వేల ఎకరాల భూమిని రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు.. అమరావతి రైతులు వీరోచితంగా పోరాడారు, ఇది వాళ్ల విజయం.. అమరావతి రైతులు చేసిన ఉద్యమం లాంటి ఉద్యమాన్ని ఇంత వరకు నేను ఎప్పుడూ చూడలేదు.” అని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!