మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు.. వంశీని అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు.. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ముందస్తు బెయిల్ పై ఉన్నారు వల్లభనేని వంశీ.. అయితే, ఈ కేసులో తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్థన్.. ఈ కేసులో ఇవాళ కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉండగా.. ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్‌కు వచ్చిన ఏపీ పోలీసులు..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు.. అయితే, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు వంశీ..
తాను సంతృప్తికరంగా సర్వీసును ముగిస్తున్నాను అన్నారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమల రావు. ఏడు నెలలుగా డీజీపీగా పని చేస్తున్నాను.. 35 ఏళ్లుగా పోలీస్ సేవలు సంతృప్తికరంగా అందించాను అనే తృప్తి ఉంది.. సంతృప్తికరంగా సర్వీసును ముగిస్తున్నాను అన్నారు..
ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందాల నిర్వహణపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. సంక్రాంతి సంబరాల పేరుతో సిద్ధం చేసిన కోడిపందాల బరులను ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తున్నారు.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల ఏపీలో వరుసగా కేసులు బుక్ అవుతున్నాయి. గతంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేయడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడులో టీడీపీ నేత రామలింగం ఫిర్యాదు చేశారు. ఆ మేరకు హైదరాబాద్‌లోని వర్మ నివాసానికి వెళ్లి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చి వచ్చారు ప్రకాశం పోలీసులు.
RGV : ఏపీ పోలీసుల గాలింపుపై డైరెక్టర్ RGV స్పందించారు. ఈ కేసులకు నేనే భయపడడం లేదు అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు ఆర్జీవీ. మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో వర్మపై అభ్యంతరకర పోస్టుల కేసు నమోదైంది. టీడీపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, రామ్ గోపాల్ వర్మ తన సినిమా వ్యూహం ప్రచారం సమయంలో వైసీపీ ప్రభుత్వాన్ని తక్కువచేసేలా సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అలాగే, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్…
ప్రముఖ రాజకీయ నాయకులపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు చుక్కెదురైంది. ఆర్జీవీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. ప్రస్తుతం ఆర్జీవీ పరారీలో ఉన్నాడు. దీంతో ఆర్జీవీ కోసం ఒంగోలు పోలీసులు హైదరాబాద్, తమిళనాడులో గాలింపు కొనసాగిస్తున్నారు. రామ్‌గోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు కోయంబత్తూరు వెళ్లినట్టు సమాచారం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా…
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైంది. మరోసారి ప్రకాశం జిల్లా పోలీసులకు ఆర్జీవీ హ్యాండ్ ఇచ్చారు. ఇవాళ ఒంగోలు రూరల్ సర్కిల్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిన ఆయన డుమ్మా కొట్టారు. విచారణకు హాజరుకాలేనని పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణకు ఆర్జీవీ హాజరుకాకుంటే.. ఆయనను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్‌లోని వర్మ నివాసానికి ఇప్పటికే జిల్లా పోలీసులు చేరుకున్నారు. ఈనెల 19న విచారణకి హాజరు కాకుండా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ వారం రోజులు గడువు కోరటంతో.. ఆయన…
వైసీపీ కీలక నాయకులపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్తో పాటు వైసీపీ నేతల కుటుంబాలపై ఐ టిడిపి అనే పేరుతో అసభ్య కామెంట్స్ చేస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు.
పోలీస్ బాస్లు పొలిటికల్ బాస్ల కోసం, పనిచేస్తున్నారని మాజీ మంత్రి విడదల రజనీ విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలని మాటలకే పరిమితమయ్యాయన్నారు. ఆ లోపాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే ఇలా అక్రమ కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు.