Ram Gopal Varma: రామ్‌గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా!
- రామ్‌గోపాల్ వర్మకు చుక్కెదురు
- విచారణ రేపటికి వాయిదా
- పరారీలో రామ్‌గోపాల్ వర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ రాజకీయ నాయకులపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు చుక్కెదురైంది. ఆర్జీవీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. ప్రస్తుతం ఆర్జీవీ పరారీలో ఉన్నాడు. దీంతో ఆర్జీవీ కోసం ఒంగోలు పోలీసులు హైదరాబాద్, తమిళనాడులో గాలింపు కొనసాగిస్తున్నారు. రామ్‌గోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు కోయంబత్తూరు వెళ్లినట్టు సమాచారం.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి.. ఎక్స్‌లో పోస్ట్ చేసిన వ్యవహారంలో ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో కేసు నమోదైంది. విశాఖ, గుంటూరు జిల్లాల్లో కూడా ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో పోలీసులు నోటీసులు పంపినా.. ఆర్జీవీ విచారణకు హాజరుకాలేదు. నవంబర్ 25న తన ఎదుట హాజరు కావాలని విచారణాధికారి నోటీసులు పంపారు. అప్పటికే హైకోర్టులో వర్మ మరోసారి బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. ఆయన నుంచి ఎటువంటి సమాచారం లేదు. దాంతో నిన్న ఉదయం 11 గంటల తర్వాత పోలీసులు హైదరాబాద్‌లోని ఆర్జీవీ కార్యాలయానికి వెళ్లారు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
రామ్‌గోపాల్ వర్మ పీఏ, మేనేజర్‌తో పోలీసులు మాట్లాడినా ఆయన అందుబాటులోకి రాలేదు. వర్మ ఫోన్ కూడా స్విచాఫ్ చేసి ఉండటంతో.. ఉద్దేశపూర్వకంగానే తమను తప్పుదారి పట్టిస్తున్నారని పోలీసులు భావించారు. వర్మ కోసం హైదరాబాద్‌తో పాటు తమిళనాడు రాష్ట్రంలో పోలీసులు గాలిస్తున్నారు. 23న కోయంబత్తూరులో షూటింగ్‌లో పాల్గొన్నట్టు నటులతో దిగిన ఫొటోలను ఎక్స్‌లో ట్వీట్ చేశాడు వర్మ. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు వర్మ కోసం కోయంబత్తూరు వెళ్లినట్టు సమాచారం తెలుస్తోంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!