ఏపీలో కానిస్టేబుల్ హత్య ఘటన కలకలం సృష్టించింది.. అయితే, ఈ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం పెద్ద కంబులూరుకి చెందిన కానిస్టేబుల్ ఫరూక్.. మంగళగిరి లో ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా పనిచేస్తూ నాలుగు రోజుల క్రితం అదృశ్యం కాగా.. మృతదేహం నల్లమల అటవీ ప్రాంతంలో పచ్చర్ల వద్ద బయటపడింది.
ఐటీడీపీ నేత చేబ్రోలు కిరణ్ కి మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మాజీ సీఎం జగన్ సతీమణి భారతిని దూషించిన కేసులో కిరణ్ కు రిమాండ్ విధించారు. కిరణ్ పై 111 సెక్షన్ పెట్టడంతో మంగళగిరి రూరల్ సీఐపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. మీ ఇష్టానుసారంగా సెక్షన్లు పెట్టి చట్టాన్ని అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరి సీఐ శ్రీనివాసరావుకు ఛార్జ్ మోమో ఇవ్వాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. లిఖిత పూర్వక వివరణ…
VC Sajjanar : గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చర్చనీయాంశంగా మారాయి. చాలా మంది యువత ఈ యాప్స్‌కు బానిసై అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఫలితంగా ఆర్థికంగా నష్టపోయి, కొందరు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్‌ను అనేక మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఐపీఎస్ అధికారి, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అమాయక యువతను బెట్టింగ్ వైపు మళ్లిస్తున్న సోషల్…
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల భద్రతకై కొత్త యాప్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీ పోలీస్ శాఖ రూపొందించిన "శక్తి" యాప్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించిన ఆయన.. మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ రూపొందించిన 'శక్తి' యాప్ ను ప్రారంభించారు.. చేనేత ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించేలా చేనేత రథాన్ని కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ-వ్యాపారి పోర్టల్ డెలివరీని కూడా ఆవిష్కరించారు ఏపీ సీఎం.
సినీనటుడు పోసాని కృష్ణ మురళి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ,మంత్రి నారా లోకేష్ తో పాటు సినీ పరిశ్రమమీద పోసాని చేసిన వ్యాఖ్యలపై ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిన కేసులో పోలీసులు పోసానిని అరెస్టు చేసి కోర్టుమందు హాజరు పెట్టగా, రైల్వే కోడూరు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించింది. పోసాని రిమాండ్ లో ఉండగానే రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై పలు కేసులు నమోదు అయ్యాయి. Also Read…
ఇంట్లో రచ్చ... బయటా రచ్చే.... ముందూ వెనకా చూసుకోకుండా మాట విసిరేయటం, తర్వాత గొడవ కొని తెచ్చుకోవడం.... ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గురించి శ్రీకాకుళం పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ ఇది.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెండో రోజు విచారణ ముగిసింది. అనంతరం.. వైద్య పరీక్షలు నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళారు పోలీసులు. వంశీని మూడు గంటలకు పైగా విచారించారు.
వల్లభనేనిపై మరో ఫిర్యాదు అందింది.. కోనాయి చెరువు రిజర్వాయర్ కు అదనంగా మరో రిజర్వాయర్ నిర్మాణం పేరిట మట్టి తవ్వకాలు చేపట్టినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.. తొండెం గట్టు చెరువులో మట్టి తవ్వకాలు చేసి కోట్లు కొల్లగొట్టినట్టు వంశీ, ఆయన అనుచరులపై గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు మురళీ అనే వ్యక్తి.. దీంతో, వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు చేసేందుకు సిద్ధం అవుతున్నారు పోలీసులు..
విశాఖలో జ్యోతిష్యుడు మృతి కేసును ఛేదించారు పోలీసులు.. బీమిలి బీచ్ రోడ్డు కాపులుప్పాడలో అస్థిపంజరం కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అస్థిపంజరం కనిపించిన చోటే రుద్రాక్షలు, ఎరుపు, పసుపు పూసల దండలు, సగం కాలిన కనకదుర్గ ఫోటో, ఆకుపచ్చ పంచె అవశేషం కనిపించాయి. అస్థిపంజరం వద్ద లభించిన ఆనవాళ్లు ఆధారంగా చనిపోయింది పెందుర్తికి చెందిన జ్యోతిష్కుడు, 50 ఏళ్ల మోతి అప్పన్నదిగా గుర్తించారు కుటుంబ సభ్యులు. గుర్తు తెలియని వ్యక్తి మోతి అప్పన్నను ఇక్కడకు తీసుకొచ్చి చంపేసిన…
గత రాత్రి పోలీసులకు మంచు మనోజ్ కు వాగ్వాదం చోటు చేసుకుంది. పెట్రోలింగ్ లో భాగంగా భాకరపేట సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు గెస్ట్ హౌస్ తనిఖీ కి వెళ్ళిన ఎస్ ఐ తో మనోజ్ గొడవ పడ్డారు. అయితే రాత్రి జరిగిన ఘటనపై వీడియో రిలీజ్ చేసాడు మంచు మనోజ్. మనోజ్ మాట్లాడుతూ ‘తాను ఎలాంటి తప్పు చేయలేదు, ఎక్కడ కూడా మిస్ బిహేవ్ చేయలేదు. తాను చట్టానికి లోబడే పోలీసులకు సహకరించాను. పోలీసులు వచ్చి…