Andhra Pradesh: కోడిపందాలపై పోలీసుల కొరడా.. బరులు ఎక్కడికక్కడ ధ్వంసం..!
- ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందాలపై పోలీసుల కొరడా..
- కోడిపందాల బరులు ఎక్కడికక్కడ ధ్వంసం..
- జంగారెడ్డిగూడెం మండలంలో కోడిపందాల బరులను ధ్వంసం..
- లక్కవరంలో ట్రాక్టర్లతో దున్ని పందెం బరుల ధ్వంసం ..
- ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో కోడిపందాల బరుల ధ్వంసం..
- అంబేద్కర్ కోనసీమ జిల్లా రోళ్లపాలెంలో పందెం బరుల ధ్వంసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందాల నిర్వహణపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. సంక్రాంతి సంబరాల పేరుతో సిద్ధం చేసిన కోడిపందాల బరులను ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో కోడిపందాల బరులను పోలీసులు ధ్వంసం చేశారు. లక్కవరంలోనూ పందెం బరులను ధ్వంసం చేశారు పోలీసులు. ఈ సందర్భంగా జంగారెడ్డి గూడెం డీఎస్పీ కోడి పందెం నిర్వహకులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కోడి పందాలు, గుండాట, కోతాటలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read Also: Kane Williamson: ఐపీఎల్ ఛీ..పో.. అంది.. అక్కడ మాత్రం అరంగేట్రం మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ
Also Read
- Abhijeet Deepke: ఎవరీ అభిజీత్ దీప్కే? ఆందోళనలకు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనల వెనుక దాగి ఉన్న ప్రశ్నలు, అనుమానాలు!
- 2027 వరల్డ్‌కప్‌కు Ravi Shastri డ్రీమ్ టీమిండియా ఇదే.. రో-కోకు చోటు.. నలుగురు పేసర్లతో జట్టు మాములుగా లేదుగా.!
- Dinner Foods: ఆరోగ్యకరమైనవే.. అయినా రాత్రిపూట ఇవి తినొద్దు.. వైద్యుల హెచ్చరిక..
- Traffic Police New Rules: ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్.. డ్యూటీలో మొబైల్ వాడకం కుదరదు..!
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో కోడిపందాల బరులను పోలీసులు ట్రాక్టర్లతో దున్నించారు. పోలీసులు నిర్వాహకులను పిలిపించి హెచ్చరించారు. కోడిపందాలకు అనుమతులు లేవని.. కాదని హద్దుమీరితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అంతేకాదు కోడి పందాలు వద్దు.. గ్రామీణ క్రీడలే ముద్దు అని పోలీసులు, రెవెన్యూ అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇక, అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో కోడి పందాల బరులను పోలీసులు ధ్వంసం చేశారు. అమలాపురం మండలం రోళ్లపాలెం గ్రామంలో కోడి పందాల బరులను ట్రాక్టర్‌తో దున్నించారు. అలాగే ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం గ్రామంలో నిర్వహిస్తున్న కోడిపందాలను పోలీసులు అడ్డుకుని కేసు నమోదు చేశారు. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా 3 రోజులు కోడి పందాలకు అనుమతి వస్తుందనే ధీమాతో కోనసీమ వ్యాప్తంగా నిర్వాహకులు బరులను సిద్ధం చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం చిన్న సమాచారం అందినా అక్కడికి చేరుకుని కోడిపందెం బరులను ధ్వసం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Maruthi Next : మారుతీ డైరెక్షన్ లో వరుణ్ తేజ్.. అవసరమా అధ్యక్ష్యా?
-
Abhijeet Deepke: ఎవరీ అభిజీత్ దీప్కే? ఆందోళనలకు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనల వెనుక దాగి ఉన్న ప్రశ్నలు, అనుమానాలు!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
2027 వరల్డ్‌కప్‌కు Ravi Shastri డ్రీమ్ టీమిండియా ఇదే.. రో-కోకు చోటు.. నలుగురు పేసర్లతో జట్టు మాములుగా లేదుగా.!
-
Dinner Foods: ఆరోగ్యకరమైనవే.. అయినా రాత్రిపూట ఇవి తినొద్దు.. వైద్యుల హెచ్చరిక..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!