రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. పోలీసులు బాధ్యతగా పని చేయకపోతే వారు చేసిన తప్పులు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయన్నారు. ఇటీవల కాకినాడ జిల్లా తుని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, ఈ వ్యవహారంలో పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
మంగళవారం అనంతపురం జిల్లాలో డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవడం కోసం హోంమంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే అనంతపురం నగరానికి చేరుకున్నారు.
Police Commemoration Day 2024: ఏ ప్రగతి జరగాలన్నా పోలీసులే కీలకం అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని ప్రశంసించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఒక పవిత్రమైన కార్యక్రమం అని, ప్రజా సేవ కోసం ప్రాణాలు వదిలిన పోలీసుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఏపీలో జీరో క్రైమ్ ఉండాలని, నేరాలు చేయాలంటే ఎవరైనా బయపడేవిధంగా పోలీసులు ఉండాలని సీఎం పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం…
ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రులు అనిత, డోల బాలవీరాంజనేయ స్వామి, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, పొలిట్ బ్యూరో సభ్యుల వర్ల రామయ్యలు భేటీ అయ్యారు. అనంతపురం జిల్లాలో రాముల వారి రథానికి నిప్పు పెట్టిన ఘటనపై పోలీసుల అధికారులు తీరుపై సీఎం వద్ద పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాళ్లపారాణి ఆరనేలేదు. పెళ్లికి వేసిన పందిరి తీయనేలేదు. అప్పగింతలు కూడా పూర్తయ్యాయో లేదో.. అప్పుడే ఆ నవ వధువు కలలు కల్లలయ్యాయి. ఏడు అడుగులు వేసి, మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను దురదృష్టం వెంటాడింది. పెళ్లైన ఐదు రోజులకే వరుడు అకస్మాత్తుగా చనిపోయాడు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలోచోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా వి. కోట పట్టణలో పెళ్లయిన 5 రోజులకే నవ వరుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.
C Sajjanar Tweet: పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా కొందరు ఇష్టానుసారంగా రీళ్లు చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ యువకుడు వ్యూస్ కోసం వెకిరి చేష్టలు చేశాడు...
నెల్లూరులోని కేంద్ర కారాగారం వద్ద భద్రతను పోలీసులు పెంచారు. రిమాండ్ ఖైదీగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నెల్లూరు కారాగారం వద్దకు పిన్నెల్లి అనుచరులు తరలివచ్చారు. విడుదలకు సంబందించిన సమయం ముగియడంతో పోలీసులు, పిన్నెల్లి అనుచరులు వెనుదిరిగారు.
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. పోలీస్ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావు వెల్లడించారు. త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాయలసీమ జిల్లాల ఎస్పీలతో డీజీపీ సమీక్ష చేపట్టారు.
మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువకుడికి ఏలూరు పోలీసులు సకాలంలో చర్యలు తీసుకున్నారు. సోమవారం సాయంత్రం 4.13 గంటలకు ఏలూరు జిల్లా 112 కంట్రోల్ రూంకు లక్ష్మి అనే మహిళ నుంచి ఫోన్ రాగా, ఆమె సోదరుడు నక్కా రాజేష్ ఏలూరు రైల్వేస్టేషన్లో ఉన్నాడని, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లు సమాచారం. విజయవాడలోని ప్రసాదంపాడుకు చెందిన రాజేష్ (31) అనే వ్యక్తి తన సోదరిని సంప్రదించి తన జీవితాన్ని ముగించాలనుకుంటున్నట్లు చెప్పాడు. కంట్రోల్ రూం సిబ్బందికి లక్ష్మి…