YS Jagan: హిందూపురంలోని వైసీపీ కార్యాలయంపై దాడిని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి వైసీపీపై మాత్రమే కాదు.. ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి అన్నారు.
Vijayawada Crime: విజయవాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యను కత్తితో నరికి హత్య చేసిన భర్త స్థానికులను భయాందోళనలకు గురి చేశాడు. ఈ సంఘటన గురువారం ఉదయం సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. హత్యకు గురైన మహిళ సరస్వతీగా గుర్తించారు. ఆమె భర్త విజయ్ తో గత కొంతకాలంగా దాంపత్య జీవితం సజావుగా సాగడం లేదు. తరచూ చిన్నచిన్న విషయాలపై ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయని, ఇటీవల వీరిద్దరూ విడివిడిగా…
Bhimavaram Double Murder: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. మన్నా చర్చ్ ఎదురుగా ఉండే ఇంటిలో తల్లిని, తమ్ముడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు దాడి చేశాడు గునుపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి.. ఈ ఘటనలో తల్లి గునుపూడి మహాలక్ష్మి, రవితేజ అక్కడికక్కడే మృతి చెందారు. తల్లిని తమ్ముడిని హత్య చేసిన అనంతరం నిందితుడు 112 కాల్ ద్వారా పోలీసులకు సమాచారం అందించడం. ఘటన స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి ఆధ్వర్యంలో…
Jogi Ramesh: విజయవాడలోని గురునానక్ కాలనీలోని ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్లో నాలుగు గంటలుగా వైసీపీ మాజీమంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము ఉన్నారు. జోగి రమేష్ ను అదుపులోకి తీసుకున్న అనంతరం ఆయన ఇంటిలో సిట్ అధికారుల తనిఖీలు చేపట్టారు.
మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. కుటుంబం కంటే ప్రజల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే పోలీసుల సేవలు అమూల్యమైనవి.. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు పట్ల నిబద్ధతతో ఉందని పేర్కొన్నారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడే కీలక బాధ్యత పోలీసులు నిర్వర్తిస్తున్నారు.
YSRCP: ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ దిగజారి పోయిందని.. ప్రజలకు స్వేచ్చ లేకుండా పోయిందని ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి.. పోలీసులను ప్రభుత్వ పెద్దలు ఇష్టానుసారం వాడుకుంటున్నారని.. నల్లపాడు పీఎస్ పరిధిలో జరిగిన ఒక హత్య కేసులో మా పార్టీ కార్యకర్తను అరెస్టు చేశారన్నారు.. మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలో వైసీపీ తరపున గట్టిగా నిలబడ్డాడని వీరయ్య అనే తమ పార్టీ కార్యకర్తను అరెస్టు చేశారన్నారు.. మధ్యవర్తినామాలో పోలీసులు ఇష్టానుసారం…
Crime: లిక్కర్లో రకరకాల ప్లేవర్స్.. టేస్టులు ఉన్నట్టుగానే.. మందు బాబుల్లో కూడా చాలా షేడ్స్ ఉంటాయి.. మందు లోపలికి వెళ్లిన తర్వాత.. తన అసలు రూపాన్ని బయటపెట్టుకున్నేవాళ్లు కొందరైతే.. తనకు సంబంధంలేని విషయాల్లో కూడా వేలు పెట్టేవారు మరికొందరు.. ఇంకా కొందరైతే.. తన గురించి.. తానే గొప్పగా ఊహించుకుంటారు.. ఇంకా కొందరు గమ్మున ఉంటే.. మరికొందరు.. పక్కనోడిని గెలికేస్తుంటాడు.. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే. మద్యం మత్తులో డయల్ 100కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి ఏకంగా సీఎంను…
Fake Liquor Case: నకిలీ మద్యం కేసుకి సంబంధించిన మూలాలు విజయవాడ ఇబ్రహీంపట్నంలో బయటపడ్డాయి. కేసులో ఏవన్గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్ధన్కి సంబంధించిన గోడౌన్లో పెద్ద ఎత్తున మద్యం తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచినటువంటి స్పిరిట్ అదే విధంగా ఖాళీ బాటిల్లను అధికారులు సీజ్ చేశారు. వీటితోపాటు ఇప్పటికే కొంత మద్యాన్ని తయారు చేసినట్లు గుర్తించి ఆ బాటిల్స్ ని కూడా సీజ్ చేశారు. కేసులో ఏ వన్గా జనార్ధన్ ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.…