ప్రజలను పదేపదే కార్యాలయాలకు తిప్పుకోవద్దని మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులకు సూచించారు.తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజల సమర్పించిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు జీరో స్థాయికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలన్నారు. ప్రతి సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రీవెన్స్ డే నిర్వహించాలని.. అధికారులంతా ఆ రోజు కార్యాలయాల్లో ఉండాల్సిందేనని, వచ్చిన గ్రీవెన్స్ ను ప్రభావవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. పంటపోలాలకు మాత్రమే కాక త్వరలో ఇళ్లకు, ఇంటి స్థలాలకు కూడా జీయో ట్యాగింగ్ ను తీసుకువస్తామని చెప్పారు. దీని వల్ల భూముల యాజమాన్య హక్కులకు సంబంధించి వివాదాలు తగ్గుముఖం పట్టే అవకాశముందన్నారు. త్వరలోనే రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తామని, ఏక కాలంలో రెవిన్యూ సదస్సులతోపాటు రీసర్వేలో జరిగిన పోరపాట్లను కూడా సరి చేయాల్సి ఉందన్నారు.
READ MORE: New Liquor Policy: 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి కసరత్తు ప్రారంభం..
పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు కలెక్టర్లు తగిన గౌవరం ఇవ్వాలని, వారు తెచ్చిన సమస్యలను నిబంధనలకు అనుగణంగా ఉంటే వెంటనే పరిష్కరించాలని, పోలిటికల్ గవర్నెన్స్ కూడా చాలా ముఖ్యమని కలెక్టర్లకు సూచించారు. మంగళవారం మంగళగిరిలోని సీసీఎల్ఎ కార్యాయలంలో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో మంత్రి అనగాని సత్యప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్ పి సిసోదియా, సీసీఎల్ఎ జయలక్ష్మీ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీ శేషగిరి బాబు, ఇతర రెవిన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్, రిజిస్టర్ కాబడ్డ ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్, ప్రజల నుండి వచ్చిన అర్జీలకు పరిష్కారం, సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్ అంశాలపై కలెక్టర్లతో మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు.
READ MORE:UP: యూపీలో ఘోరం.. ఫీజు కట్టలేదని విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టిన ప్రిన్సిపాల్
ఈనెల చివరి నాటికి ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్ పూర్తి…
ఈ నెల చివరి నాటికి ఫ్రీ హోల్డ్ భూములపై వెరిఫికేషన్ పూర్తి చేయాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. గత ప్రభుత్వంలో అసైన్డ్ భూములను చట్ట విరుద్దంగా ఫ్రీ హోల్డ్ చేసి కొంత మంది అనుచిత లబ్ది పోందారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ భూములను వెరిఫై చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొత్తం 13,59,804 ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేయగా ఇప్పటి వరకు 4,17,640 ఎకరాలను వెరిఫై చేశారు. ఇందులో నిబంధనలకు విరుద్దంగా 91,739 ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేశారు. అలాగే ఫ్రీ హోల్డ్ చేసిన భూముల్లో ఇప్పటి వరకు 25,230 ఎకరాలను రిజిస్టర్ చేయగా అందులో నిబంధనలకు విరుద్దంగా 4,245 ఎకరాలను రిజిస్టర్ చేశారు. అయితే ఈనెల చివరి నాటికి ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్ మొత్తం పూర్తవ్వాలని మంత్రి అనగాని ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా నిబంధనలకు విరుద్దంగా చేసిన ఫ్రీహోల్డ్ భూములపై న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించారు.
READ MORE:China President: మున్ముందు చైనా గడ్డు పరిస్థితులు ఎదుర్కోనుంది..
అర్జీల పరిష్కారంలో జాప్యంపై సిసోదియా సీరియస్..
అర్జీల పరిష్కారంలో జరుగుతన్న జాప్యంపై రెవిన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోదియా సీరియస్ అయ్యారు. రెవిన్యూ శాఖా మంత్రి కార్యాలయం నుండి 1414 అర్జీలు పరిష్కారం కోసం కలెక్టర్లకు పంపగా కేవలం 16 అర్జీలకు మాత్రమే తిరిగి సమాధానం రావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంవో నుండి గానీ, రెవిన్యూ మంత్రి కార్యాయలం నుండి గానీ, తన కార్యాలయం నుండి గానీ వచ్చిన అర్జీలకు సరైన సమయంలో స్పందించకుంటే ఆయా కలెక్టర్లపై తగు చర్యలు ఉంటాయని అన్నారు. ఈ మూడు కార్యాలయాల నుండి ఏ సమాచారం అడిగినా వెనువెంటనే స్పందించాలని ఆదేశించారు.