తిరుపతి లడ్డూను వివాదంలోకి తీసుకురావాలనేది వైయస్సార్ వైసీపీ ఉద్దేశం కాదని.. చంద్రబాబు వివాదమాయం చేయాలని ప్రయత్నించినప్పుడు… ఆయన చెప్పిన అబద్ధాలపై వివరాలను మాత్రమే ఇచ్చామని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతోనే తాము స్పందించమన్నారు. సుప్రీంకోర్టు పరిధిలో ఈ అంశం ఉండడంతో మాట్లాడటం సరికాదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మాట్లాడతామన్నారు. “సనాతన ధర్మం గురించి పవన్ మాట్లాడుతున్నారు. సనాతన ధర్మంలో చాలా రకాలు ఉన్నాయి. సనాతన ధర్మంలో ఒక మనిషి విడాకులు తీసుకోకూడదని ఉంది. భార్యాభర్తల మధ్య వివాదాలు వచ్చినా సర్దుబాటు చేసుకోవాలే తప్ప విడిపోకూడదని సనాతన ధర్మం చెబుతోంది. ఇవన్నీ ఆచరించి సనాతన ధర్మం గురించి ప్రజలకు చెప్పాలి. సనాతన ధర్మం గురించి తెలుసుకోకుండా దాని గురించి మాట్లాడటం సరికాదు. అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
READ MORE: Indian Army Chief: లెబనాన్- ఇజ్రాయెల్ యుద్ధంపై భారత ఆర్మీ చీఫ్ రియాక్షన్ ఇదే..!
ఇదిలా ఉండగా.. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు తిరుమలకు చేరుకోనున్నారు. ప్రాయశ్చిత దీక్ష చేస్తున్న పవన్.. ఈరోజు రాత్రి తిరుపతి చేరుకుంటారు. అక్కడి నుంచి కాలి నడకన తిరుమలకు బయల్దేరుతారు. ఇక, పవన్ కల్యాణ్ పర్యటనకు నడకమార్గంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. 200 మీటర్ల పరిధి వరకు రోప్ పార్టీలతో భద్రతన ఏర్పాటు చేస్తున్నారు. పవన్‌తో పాటు నడిచే ప్రయత్నం చేయవద్దని పార్టీ నేతలకు ఇప్పటికే సూచించారు జనసేన నేతలు.. ఇక, తిరుమల పర్యటన నిమిత్తం.. సాయంత్రం 5 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరి రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న పవన్ కల్యాణ్.. అక్కడి నుంచి తిరుపతి చేరుకొని.. రాత్రికి కాలినడకన తిరుమల చేరుకోనున్నారు..