ఏపీ ప్రభుత్వం ఇసుక విషయంలో గుడ్‌న్యూస్ చెప్పింది.ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను ట్రాక్టర్లల్లో తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో స్థానిక అవసరాలకు ఇసుకను తీసుకెళ్లేందుకు కేవలం ఎడ్ల బండ్లకు మాత్రమే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.
మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు పోలీస్ కస్టడీ విధిస్తూ మంగళగిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన మహిళ హత్య కేసులో రిమాండ్ ఖైదీ నందిగం సురేష్ ను పోలీస్ కస్టడీకి ఇస్తూ మంగళగిరి కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 26వ తేదీ నుంచి తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిసారి కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించామన్నారు. సాధారణ సభ్యత్వ రుసుము ఎప్పటిలాగా రూ.100 ఉంటుందని.. ఈ ఏడాది నుంచి కొత్తగా లైఫ్ టైం సభ్యత్వాన్ని ప్రవేశపెడుతున్నాం.. దీని రుసుము రూ.1,00,000 గా నిర్ణయించామన్నారు.
అక్టోబర్ 21న సంస్మరణ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహిస్తున్నామని.. ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావు పేర్కొన్నారు. అక్టోబర్ 21 నుండి 31 వరకు పదిరోజులు సంస్మరణ దినోత్సవాలు జరుపుతున్నామని ఆయన తెలిపారు.
వైసీపీ చేయని తప్పులు లేవని.. లేకుంటే ఎందుకు ఎన్నికల్లో 11కు పడిపోయారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మనం నిలబడ్డాం నిలదొక్కుకున్నామని.. 93 శాతం సీట్లు వచ్చాయంటే... అందరం గుర్తు పెట్టుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం టీడీపీ ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు. విదేశాల నుంచీ వచ్చి మరీ మనల్ని గెలిపించారన్నారు.
రాష్ట్రంలోని పట్టణాలను అందంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలతో పాటు వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
ప్రభుత్వ సర్వజనాసుపత్రుల నిర్వహణ, సేవల్ని మెరుగుపర్చి వీటి పట్ల ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని కలిగించేందుకు రెండు నెలల క్రితం రూపొందించిన 30 అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళిక అమలుపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ సచివాలయంలో సుదీర్ఘంగా సమీక్షించారు. మూడు గంటల పాటు సాగిన సమీక్షలో అంశాల వారీగా జీజీహెచ్‌లలో చేపట్టబడిన చర్యలపై వివరాల్ని మంత్రి అడిగి తెలుసుకున్నారు.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసును అడ్డుపెట్టుకొని వైసీపీ నాయకులను వేధిస్తున్నారని, తప్పుడు కేసులు పెడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు.
కేరళ తరహాలో తీర ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేయాలని, అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో మత్స్య శాఖపై మంత్రి అచ్చెన్నాయుడు మత్స్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎమ్.ఎమ్.నాయక్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు కొత్త పాలసీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం పలికారు, బెస్ట్ పారిశ్రామిక పాలసీలతో ఏపీ ఇప్పుడు పెట్టుబడులకు సిద్దంగా ఉందంటూ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. ఏపీలో కార్యకలాపాలకు పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ స్వాగతం అంటూ ముఖ్యమంత్రి స్వాగతం పలికారు.